పామును కసకస నమిలి మింగిన జింక- సైన్స్‌కు కొత్త సవాల్

న్యూఢిల్లీ: సాధారణంగా జింకలను సాధు జంతువులుగా భావిస్తుంటారు. మాంసాహారం జోలికి వెళ్లవు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూంటాయి. మాంసాహారాన్ని తీసుకోని జంతువులను హెర్బివర్‌ అంటే శాకాహారిగా పిలుస్తారు. మాంసాహారాన్ని తినే జంతువులను కార్నివర్‌గా పిలుస్తారనేది సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం. ఇదే వాస్తవం కూడా.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరినట్టుగా కనిపిస్తోందా వీడియో. దీనికి కారణం లేకపోలేదు. ఓ జింక.. చనిపోయిన పామును కసకస నిమిలి మింగడం కనిపించింది. హెర్బివర్‌ జాతికి చెందిన జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్యర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఓ బిగ్ డిబేట్‌కు దారి తీసింది.

Viral video: A deer eating a snake has raised eyebrows

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేశారు. శాకాహార జంతువులు కొన్నిసార్లు పాములను తింటాయని చెప్పుకొచ్చారు. ఓ జింక పామును నమలడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ ఉదంతం.. సైన్స్‌కు సరికొత్త సవాల్‌ను విసిరిందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఎంత లోతుగా పరిశోధిస్తామో, అది అంత రహస్యంగా మారుతుందనడానికి ఈ వీడియో క్లిప్ రుజువు చేస్తోందని చెబుతున్నారు. శాకాహారులు ఒక్కో సందర్భంలో మాంసం తినొచ్చు గానీ.. మాంసాహారులు గడ్డిని తినలేరని, కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తోన్నారు.

ప్రకృతిలో ఊహకు అందని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని, వాటి అంతు ఏమిటో మనం చూడలేమని స్పష్టం చేస్తోన్నారు. జింకలు మాంసాహారాన్ని తింటాయనే విషయాన్ని ఊహకు కూడా అందలేదని, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు మన కళ్లముందుకొస్తాయనడానికి ఈ వీడియో ఓ ఉదాహరణగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+