• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో.. కోపంతో ఊగిపోయిన గజరాజు, బస్సు అద్దాలను పగులగొడుతూ.. బీభత్సం (వీడియో)

|

ఏనుగు.. కోపంతో ఉన్నప్పుడు చూడలేం.. చూసి తట్టుకునే పరిస్థితి ఉండదు. అటవీ ప్రాంతం లేదంటే శ్రీకాకుళంలో ఏనుగుల గుంపు వస్తోన్న ఘటనలు చూశాం.. పంటలను నాశనం చేయడంతో అన్నదాత బోరుమనే పరిస్థితి. మరికొన్ని చోట్ల ఏనుగులను మచ్చిక చేసుకుంటారు. తిరుమల లాంటి పవిత్ర పుణ్యస్థలంలో వయసు పైబడిన ఏనుగులు కనిపిస్తోంటాయి. ఇక విషయానికి వస్తే.. ఓ ఏనుగు బస్సుకు ఎదురుగా వచ్చింది. అలా ఊరుకుందా అంటే అదీ లేదు.. కాసేపు బీభత్సం సృష్టించింది. దీంతో అందులో ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోపంతో గజరాజు..


తమిళనాడులో గల నీలగిరి వద్ద ఆర్టీసీ బస్సు వచ్చి ఆగింది. ఎదురుగా ఓ ఏనుగు కోపంతో ఉంది. దానిని చూసి డ్రైవర్ బస్సును ఆపివేశాడు. అదీ మెల్లగా ముందుకు కదలింది. ఇంకేముంది తన దంతాలతో బస్సు అద్దాన్ని పొడవగా దానికి పగులు వచ్చింది. డ్రైవర్ దిక్కు రాగా.. అతను హ్యాండ్ బ్రైక్ వేసి వెనక్కి వచ్చారు. ఆ సమయంలో బస్సులో జనాలు ఉన్నారు. వారి పరిస్థితి వర్ణణాతీతం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. బిక్కు బిక్కుమని ఆ సమయం గడిపారు. ఈ వీడియోను తమిళనాడు పర్యావరణ, వాతావరణ మార్పులు, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. వామ్మో అంటూ జనం కామెంట్లు పెడుతున్నారు.

డ్రైవర్ గజ గజ..

ఆ వీడియో నిడివి నిమిషం ఉంది. ఏనుగు ముందుకు రావడంతో డ్రైవర్ కూడా భయపడిపోయాడు. వాస్తవానికి రివర్స్ చేద్దాం అని కూడా అనుకున్నారు. కానీ అదీ మరింత ముందుకు రావడం.. దంతాలతో అద్దాన్ని పగలగొట్టడంతో వీలుపడలేదు. అలా కాకుండా వెనక్కి తీస్తే ఆ ఏనుగు పరుగెడుతుందని కూడా భావించాడు. బస్సును అక్కడే ఉంచాడు. అలా ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగారు. ఆ బస్సు డ్రైవర్‌ను అందరూ కొనియాడుతున్నారు. అతను చేసిన పని వల్ల.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. నీలగిరిస్‌లో ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది.

25వ తేదీన ఘటన

ఈ నెల 25వ తేదీన ఇన్సిడెంట్ జరిగింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 70 వేల మంది వీడియో చేశారు. ఆ డ్రైవర్‌ను ప్రతీ ఒక్క నెటిజన్ ప్రశంసిస్తున్నారు. అలాగే రహదారిపైకి ఏనుగులు రావడం.. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమేనని... ఇందుకు సరయిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. ఘటనపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు. ఆ సమయంలో బస్సులో మీరు ఉంటే ఎలా ఫీలయ్యేవారు... బస్సును వెనక్కి తీస్తే పరిస్థితి ఏంటీ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నెటిజన్ల కామెంట్స్..

ఆ సమయంలో కోపంతో ఏనుగు వచ్చిందని.. దాని పరిస్థితిని అర్థం చేసుకొని డ్రైవర్ మెలిగాడని మరొ నెటిజన్ పోస్ట్ చేశారు. అతనిని అభినందించలేక ఉండలేకపోతున్నామని కామెంట్ చేశారు. మంచి మూడ్‌తో ప్రశాంతంగా ఉండి.. ప్రయాణికులను సేవ్ చేశారని మరొకరు కామెంట్ చేశారు. అసలే అదీ ఘాట్ రోడ్డు అని.. అక్కడ రివర్స్ తీయడం అంతా ఈజీ కాదని చెప్పారు. కానీ తెలివితో సిచుయేషన్ ఫేష్ చేశారని తెలిపారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్లు అందరినీ ప్రశంసించారు.

జంతువులను ఉండనివ్వొచ్చు కదా..?


జంతువులు ఉండే చోట వారిని ఉండనివ్వాలని మరొకరు సజెస్ట్ చేశారు. అభయారణ్యం/ అటవీ గుండా ప్రయాణించడం ఎందుకు అని అడిగారు. వాటి సముహంలోకి వెళితేనే కదా దాడి చేయాల్సి వచ్చిందని ఓ నెటిజన్.. జంతు ప్రేమికుడిలా ట్వీట్ చేశారు. వాస్తవానికి ఇదీ కూడా కరెక్టే.. కానీ ఆలయాలు లేదంటే టూరిస్ట్ స్పాట్ కోసం వెళ్లడం మాత్రం తప్పడం లేదు. తెలివితో విపత్కర పరిస్థితిని డ్రైవర్ లీడ్ చేశారని మరో నెటిజన్ ప్రశంసించారు. ఆ వీడియో చూస్తేనే భయమెస్తోందని.. మరొకరు కామెంట్ చేశారు.

English summary
shocking video of a tusker attacking a government bus in the Nilgiris, Tamil Nadu has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X