Viral Video: క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి మద్దతుగా గుండు చేయించుకున్న స్నేహితులు..

సృష్టిలో చాలా అందమైనది స్నేహం. ఒక మంచి స్నేహితుడు 100 పుస్తకాలలో సమానమని చెప్తారు. అటువంటి స్నేహం చాలా విలువైనది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అవతలి వ్యక్తిని జడ్జ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ స్నేహితుడు మాత్రమే జడ్జ్ చేయకుండా మనం చెప్పే ప్రతిదీ వింటాడు. అటువంటి గొప్ప స్నేహాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి.

సోషల్ మీడియాలో స్నేహానికి ప్రతీకగా నిలిచిన వీడియో
స్నేహ సంబంధాలు కూడా ఇప్పుడు కమర్షియల్ కాలంలో ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఇక ఇలాంటి సమయంలో కూడా స్వచ్ఛమైన, నిష్కల్మషమైన స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్నేహానికి అద్దం పట్టేలా చేసిన చిన్నారుల స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మన్ననలను పొందుతుంది.

viral video on friendship Students Shave Heads in Solidarity With Classmate Battling Cancer

బాలికకు క్యాన్సర్.. స్నేహితులు ఏం చేశారంటే
మనదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిందో తెలియదు కానీ ఒక బాలికకు క్యాన్సర్ సోకడంతో, ఆమెకు కీమోథెరపీ నిర్వహిస్తున్న క్రమంలో తన జుట్టు అంతా పూర్తిగా రాలిపోయింది. తన గుండెతో పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బంది పడిన బాలికను చూసిన తోటి విద్యార్థులు చలించిపోయారు. తమ స్నేహితురాలి కోసం ఏమైనా చేయాలని భావించారు. అంతే తన స్నేహితురాలు ఆత్మ న్యూనత భావానికి గురికాకుండా నిర్ణయం తీసుకున్న స్నేహితులు అందరూ గుండు చేయించుకున్నారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలి కోసం.. స్నేహమంటే ఇదేరా అనేలా
ఆమెకు ధైర్యం ఇచ్చి తోడుగా నిలవడానికి సహ విద్యార్థులు స్వయంగా గుండు చేయించుకున్న ఘటన, ఈ ఘటన తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరందరి స్నేహబంధం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. స్నేహమంటే ఇదేరా అని ప్రతి ఒక్కరు అనుకునేలా చేస్తుంది. జీవితంలో కష్ట కాలంలో అండ ఉండేవాళ్లే నిజమైన స్నేహితులు అన్న మాటకు ఈ వీడియో అద్దం పడుతుంది.

అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహబంధం
ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పైన పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమ జీవితంలో ప్రతి కష్టంలోనూ అండగా ఉన్న స్నేహితులను గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి స్నేహం అన్ని బంధాల కన్నా గొప్పది అని కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+