వైరల్ వీడియో: ప్రియుడితో భార్య రొమాన్స్.. పిల్లలతో కలిసి అక్కడికి వచ్చిన భర్త
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగినట్లుగా చెబుతున్న ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక మహిళ తన భర్త, పిల్లలను మోసం చేసి, తన ప్రియుడితో కలిసి హోటల్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్లినట్లు చూపబడింది. ఆమె భర్తకు ఈ విషయం తెలియడంతో, అతను వెంటనే తన పిల్లలతో కలిసి ఆ హోటల్‌కు చేరుకున్నాడు.
ప్రియుడితో గదిలో ఉన్న తన భార్యను చూసి భర్త ఆశ్చర్యపోయాడు. భర్త, పిల్లలను చూసిన వెంటనే ఆమె షాక్‌కు గురైంది. పరువు పోతుందనే భయంతో, ఆమె తన బట్టలు సర్దుకుని గది నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. భర్త ఆమెను వీడియో తీస్తుండగా, ఆమె మొదట హోటల్ బాల్కనీ నుండి పైకప్పుపైకి దూకింది. ఆ తర్వాత అక్కడి నుంచి సన్నని గోడపై నడుచుకుంటూ పక్క వీధిలోకి దూకి పారిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. వీడియో తీయవద్దని ఆమె పదేపదే వేడుకుంది.

ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, అయితే వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఈ సంఘటన ఎక్కడ జరిగిందో నాకు తెలిసుంటే, ఆ భార్యపై కేసు పెట్టేవాడిని" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సంఘటన భర్తకు, అమాయకులైన పిల్లలకు ఎంత బాధను మిగిల్చిందో ఆలోచిస్తే ఎవరైనా కలత చెందుతారు.
Oyo होटल मे जन्मदिन मना रही महिला अचानक पति बच्चों को लेकर पहुँचा पीछे पीछे कैमरामैन pic.twitter.com/7K1cj50HA2
— Deepa Singh (@DeepaSingh66877) July 15, 2025












Click it and Unblock the Notifications