Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: అక్కడ ఎలా పెట్టావ్ రా..!

ఇండియన్ రైల్వేస్ ను అతిపెద్ద నెట్ వర్క్ గా పిలుస్తుంటారు. నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. రైలులో ప్రయాణం సురక్షితం, అలాగే తక్కువ ధరతో కూడుకున్నదని భావిస్తుంటారు. అందుకే చాలామంది ప్రయాణాలను రైలులోనే సాగిస్తుంటారు. ఇక రైళ్లలో సీట్ల కోసం కొట్లాటలు కామన్ గానే ఉంటాయి. ఇటీవల రైళ్లలో ప్రయాణికులు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ViralTrain Moment Man Sleeps Hugging Cooler in Packed General Compartment in train video Epic

కొన్నిసార్లు రైళ్లలో ప్రయాణించడం నరకంగా ఉంటుంది. ఓవైపు పట్టనంత జనం.. ఉక్కపోత.. చుక్కలు కనిపిస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో అయితే ఆ రద్దీ గురించి మాటల్లో చెప్పలేము. అయితే ఇప్పుడు ఓ ప్రయాణికుడు చేసిన పని చూస్తే అందరూ నోరు వెళ్లబెడతారు. జనరల్ బోగీలో ఏసీ కూలర్ ను ఏర్పాటు చేసుకుని ఎంచక్కా నిద్రపోతున్నాడు ఆ ప్రయాణికుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు. అయితే.. రైలు కోచ్‌ లో విద్యుత్ సరఫరా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లను ఛార్జింగ్ చేయడానికి మాత్రమే.. కాబట్టి అందులో కూలర్‌ ను నడపడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. రైల్వే యంత్రాంగం అతడిపై చర్యలు తీసుకోవాలని.. రైలు ప్రయాణాల్లో ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను క్యారీ చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో రైల్వే స్టేషన్ లో భద్రతా లోపాలను.. అలాగే జనరల్ బోగీల్లో ప్రయాణికుల అవస్థలను ఎత్తి చూపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+