వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vitamin B12: విటమిన్ బి12 లోపించిందా.. అయితే ఈ తిప్పలు తప్పవు..

|
Google Oneindia TeluguNews

శరీరానికి పోషకాలతో పాటు విటమిన్లు ఎంతో అవసరం. విటమిన్ ఎ, బి, సి, బి, బి1, బి2, బి3, బి6, బి7, బి12, డి, ఇ, కె శరీరానికి ఎంతో తప్పక కావాల్సిందే. బి12 విషయానికొస్తే.. ఇది శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల పరేస్తేషియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ వ్యాధి వస్తే ఇది చేతులు, కాళ్లలో మంటలు వస్తాయట. ఈ వ్యాధి నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎర్ర రక్త కణాలు
విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు, DNA, మెదడు, నరాల కణాల అభివృద్ధి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే అలసట, చిరాకు, చర్మం పసుపు రంగులోకి మారడం, నాలుక నొప్పి, నోటిపూత, నడక శైలిలో మార్పు, దృష్టి సమస్యలు వస్తాయి. ముఖ్యం నోటి పూత ఎక్కువగా వస్తుందట. ఈ విటమిన్ బి12 నే కోబాలమిన్ అని కూడా పిలుస్తారు.

Vitamin B12 can cause many problems in the body

సీఫుడ్స్
విటమిన్ 12 జంతు ఉత్పత్తులు, సీఫుడ్స్, చికెన్, గొర్రె, మేక మాంసంలో సమృద్ధిగా లభిస్తుంది.పెరుగు, పాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుందట. సాక్కీ సాల్మన్, సిర్డినెస్, రెయిన్ బో ట్రౌట్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది. వీటిలో బి12 లే కాకుండా విటమిన్ ఎ కూడా ఉంటుంది.కూరగాయల విషయానికొస్తే బచ్చలికూర, బటర్నట్ స్క్వాష్, బీట్ రూట్, బంగాళాదుంప, పుట్టగొడుగులు విటమిన్ బి12 లభిస్తుంది. ఉడకబెట్టిన కోడి గుడ్డులో కూడూ విటమిన్ బి12 లభిస్తుంది.

English summary
Vitamin B12 can cause many problems. That is why vitamin B12 rich foods should be taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X