ఇక చెక్కుల రూపంలో వేతనాలు... చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

Posted By:
Subscribe to Oneindia Telugu
న్యూఢిల్లీ: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఇకపై తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలులోకి వచ్చింది.

వేతనాల చెల్లింపులకు సంబంధించి ఈ నూతన విధానానికి ఉద్దేశించిన వేతన చెల్లింపు (సవరణ) చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. వేతనాల చెల్లింపుల్లో నగదు రహిత విధానాలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు నిర్దేశించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది.

president pranab

అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తొలుత డిసెంబర్ 28న దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

అనంతరం ఫిబ్రవరి 7న లోక్ సభ, ఆ తరువాతి రోజు రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ చట్టం ద్వారా ఇకపై ఆయా సంస్థలు చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వేతన చెల్లింపుల చట్టం-1936కు కూడా అవసరమైన మార్పులు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The central and state governments can now specify industrial units and other establishments which will have to pay wages either through cheques or by electronically transferring into the workers’ bank accounts, as per a new law. President Pranab Mukherjee has recently given assent to the Payment of Wages (Amendment) Act, 2017, an official order said.
Please Wait while comments are loading...