షాక్: ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన లేడీ కానిస్టేబుల్(వీడియో)

Subscribe to Oneindia Telugu
  Watch- Congress MLA Asha Kumari slaps woman constable, gets slapped back - Himachal Pradesh News

  షిమ్లా: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా కానిస్టేబుల్‌‌తో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఆమెపై చేయి చేసుకున్నారు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ కూడా ఆ ఎమ్మెల్యేను తిరిగి చెంప ఛెళ్లుమనిపించారు.

   

  కానిస్టేబుల్ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే

  కానిస్టేబుల్ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే

  కాగా, పోలీస్ సిబ్బంది ఆ ఎమ్మెల్యేను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఆశాకుమారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్‌ చెంప పగలగొట్టారు.

  ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన లేడీ కానిస్టేబుల్

  ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన లేడీ కానిస్టేబుల్

  అయితే, అనూహ్యంగా ఆ లేడీ కానిస్టేబుల్ కూడా తిరిగి ఆ ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే సదరు ఎమ్మెల్యేను నేతలు, కార్యకర్తలు అక్కడ్నుంచి పక్కకు తీసుకెళ్లారు.

  ఎమ్మెల్యే క్షమాపణలు

  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఆశాకుమారి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు తాను చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆ కానిస్టేబుల్‌ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అలా చేయాల్సింది కాదు..

  అలా చేయాల్సింది కాదు..

  ‘ఆమె(మహిళా కానిస్టేబుల్‌) నన్ను తిట్టింది. నన్ను తోసింది. ఆమె నన్ను వెళ్లకుండా నిలువరించింది.. నాకు ఆమె తల్లికున్న వయసు ఉంటుంది. అయితే, ఈ సమయంలో నేను నా సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నాను' అని ఆశాకుమారి తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Congress MLA, stuck in a ruckus in Shimla, was seen on video slapping a woman constable. Not willing to back down, the constable slapped the MLA back.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి