వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:చవకకే జ్యూస్.. షుగర్ కంట్రోల్ అవుతుందట.. ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

స్ట్రీట్ ఫుడ్ అయినా.. స్ట్రీట్ జ్యూస్ అయినా కొందరు ఇష్టపడరు. మరికొందరెమో టేస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చవకకే మంచి జ్యూస్ లభిస్తాయి. అవును ఇటీవల ఒకతను ఇలానే చేశాడు. అయితే అతను చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. తన జ్యూస్ తాగితే షుగర్ నయం అవుతుందని చెబుతున్నాడు. ఇదీ కాస్త సందేహించాల్సిన విషయమే.. ఎందుకంటే షుగర్ కోసం.. చాలా మంది టాబ్లెట్స్.. మరికొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్లను వేసుకుంటారు. ఇప్పుడు ఓ పది రూపాయల జ్యూస్ షుగర్ కంట్రోల్ చేస్తోందని చెప్పడం కాస్త.. విడ్డూరమే.

రూ.10కే జ్యూస్..

రూ.10కే జ్యూస్..

అతను తన జ్యూస్ తాగమని చెబుతున్నారు. అదీ కూడా రూ.10కే.. కానీ అదీ షుగర్ కంట్రోల్ చేస్తుందట.. ఢిల్లీలో గల లాల్ క్వార్టర్ మార్కెట్ సమీపంలో గల కృష్ణానగర్ వద్ద సాజన్.. జ్యూస్ అమ్ముతున్నాడు. తన జ్యూస్ తాగితే కడుపు, రక్తం శుద్ది అవుతాయని చెబుతున్నాడు. అంతేకాదు శరీరంలో ఏ అవయవానికి ఏమీ జరగదని అంటున్నారు. అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.

ఉదయమే..

ఉదయమే..

వీడియోను అంకిత్ ధింగ్రా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అతని పేజీకి దాదాపు 15 వేల మంది ఫాలొవర్లు ఉన్నారు. జ్యూస్ కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడికి వెళ్లాలని సూచించారు. చాలా మంది ఒక గ్లాస్ జ్యూస్ కావాలని అడుగుతారట. ఇందులో అన్నీ సహజసిద్దంగా ఉండేవి వాడుతున్నందున.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు.

వీటితో జ్యూస్..

ఇందులో వేప ఆకు, దోసకాయ, పొడి పసుపు, అల్లం, గోధుమ గడ్డి, పుదీనా ఆకులు, కలబందను కలుపుతారు. ఆ తర్వాత గోరింటాకు, అశ్వగంధను యాడ్ చేస్తారు. వాటన్నింటికీ నీళ్లను కలిపి గ్రైండ్ చేస్తారు. ఇలా దాదాపు 16 రకాల ఆకులు, పొడులను కలిపి.. మిక్స్ చేసి అందరికీ అందజేస్తున్నారు. ఇదీ చూడటానికి బీట్ రూట్ మాదిరిగా కనిపిస్తోంది. అలా దానిని కలిపి.. అందిరకీ ఇస్తారు.

వెయిట్ లాస్ కూడా

వెయిట్ లాస్ కూడా

తన జ్యూస్ తాగితే బరువు కూడా తగ్గుతారని చెప్పారు. ఒక్కరోజు తాగితే ఫలితం ఉండదని.. కొన్నీ రోజులు కోర్సు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు సాజన్ మంచి మాటకారీ.. అలాగే జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తారు. అందుకోసమే ఎక్కువమంది కస్టమర్లను ఆయన ఆకట్టుకుంటున్నారు.

English summary
food cart in Delhi’s Lal Quarter market near Krishna Nagar. one can hear him say that “if the stomach and blood is purified, then nothing can go wrong in your body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X