వరదలు- కేరళ 'బాహుబలి': సామాన్యుడిలో సామాను మోసిన మంత్రి (వీడియో)
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది. కేరళీయులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మత్స్యకారులు, ఆరెస్సెస్, సేవాభారతి రంగంలోకి దిగాయి.
తాజాగా, కేరళ విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్లో వైరల్ అయింది. రిలీఫ్ మెటీరియల్‌ను ఆయన తన భుజాలపై మోసుకొస్తూ కనిపించారు. బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుకున్నట్లుగా ఉంది.

మంత్రి సామాన్యుడిలా సహాయక సామగ్రిని భుజాలపై మోస్తున్నారు. కేరళలో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సహాయక సామగ్రితో ఓ వాహనం పునరావాస శిబిరానికి చేరుకుంది. దీంతో అప్పటి వరకు అక్కడి సహాయక చర్యలను పరిశీలించిన సదరు మంత్రి కూడా రంగంలోకి దిగారు.
భుజంపై ఓ నీలం బ్యాగ్‌ను పెట్టుకుని సామగ్రిని తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మంత్రి వీడియో చూసిన పలువురు బాహుబలి అని కొనియాడారు. సామగ్రిని మోసుకెళ్లడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మరికొందరు ప్రభాస్ ఫొటోను మంత్రి ఫొటోతో జతచేసి కేరళ బాహుబలి అని కామెంట్లు పెట్టారు.
This is Kerala Education Minister C Raveendranath carrying relief material on his shoulders. Happens only in Kerala. #KeralaFloods pic.twitter.com/tlwY9a7uqH
— Zakka Jacob (@Zakka_Jacob) August 28, 2018












Click it and Unblock the Notifications