వేధింపులు: వ్యక్తిని తన్ని తరిమేసిన యువతి(వీడియో)

బెంగళూరు: తనను వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తిని వెంబడించి మరీ అతడ్ని తన్ని తరిమేసింది ఓ దైర్యవంతురాలైన యువతి. అంతేగాక ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. ‘ఈవ్ టీజర్‌కు గట్టి గుణ పాఠం' అని దానికి టైటిల్ కూడా ఇచ్చేసింది. కాగా, ఆమె చేసిన ఈ పనికి చాలా మంది నుంచి ప్రశంసలను అందుకుంటోంది. సంచలనంగా మారిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది.

‘నేను ఓ పార్కులో రోజూ మార్నింగ్ వాక్ చేస్తుంటాను. అయితే ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేశాడు. దీంతో అతడ్ని వెంబడి తన్ని తరిమేశాను. అంతేగాక అతడిపై కేసు కూడా నమోదైంది. నాకు పోలీసులు తమ సహకారాన్ని పూర్తిగా అందించారు. నాలాంటి మహిళలు తమకు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా స్పందించాలనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టాను' అని ఫేస్‌బుక్‌లో శుక్రవారం పోస్ట్ చేసింది.

watch video bangalore woman veena kicks man who harassed

ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆమె ఈ పని చేసింది. ఆ యువతి రోజూలాగే శుక్రవాం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో నిందితుడు ఆమెను వేధింపులకు గురి చేశాడు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/EBFnfNdhVFk?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

అతడ్ని పట్టించుకోవడం మానేసే బదులు పెద్ద అరుపులు చేసి అతడి వెంట పడింది. అతడు ఆమెకు దొరికిన తర్వాత అతడ్ని మొకాళ్ల మీద కూర్చొబెట్టింది. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అతడ్ని కాలుతో గట్టిగా తన్నింది. అనంతరం అతడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తాన్ని ఆమె స్నేహితులు వీడియో తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+