అగ్నివీర్ రద్దు: పాత వ్యవస్థ పునరుద్ధరణ?

Lok Sabha elections 2024 Phase 7: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.

చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

We will cancel Agniveer says Rahul Gandhi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భక్తియార్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కీలక హామీలను ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నివీర్ నియామకాల గురించి ప్రస్తావించారు. అగ్నివీర్ వల్ల ఆర్మీలో నియామకాల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, తమ ప్రాణాలను సైతం ఒడ్డి దేశానికి రక్షణగా ఉండే జవాన్లను కేంద్రం కించపరుస్తోందని విమర్శించారు.

We will cancel Agniveer says Rahul Gandhi

గతంలో అగ్నివీర్ నియామకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక పరిస్థితులను గుర్తు చేశారు. యువత మొత్తం దీన్ని వ్యతిరేకించిందని పేర్కొన్నారు. అగ్నివీర్ వ్యవస్థను తీసుకుని రావడం వల్ల ఆర్మీలో నియామకాల ప్రక్రియ మొత్తం నాశనమైందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

అగ్నివీర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా జవాన్లను కేంద్ర ప్రభుత్వం కార్మికులుగా మార్చివేసందని ఆరోపించారు. ప్రతి ఒక్కరిలోనూ ఇదే అభిప్రాయం ఉందని చెప్పారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. గతంలో ఉన్న నియామకాల ప్రక్రియను పునరుద్ధరిస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+