2025లో యూట్యూబ్‌ లో ఎక్కువమంది భారతీయులు ఏం చూశారో తెలుసా..?

యూట్యూబ్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. మన ఫోన్ లో ఎక్కువగా యూట్యూబ్ నే చూస్తుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ తమకు కావాల్సిన కంటెంట్ యూట్యూబ్ లో దొరుకుతుంది. అది సినిమాకు సంబంధించింది అయినా డివోషనల్ అయినా.. న్యూస్ అయినా.. ఫుడ్ అయినా.. నేచర్ అయినా.. ఎడ్యుకేషన్ అయినా.. ఇలా ఏదైనా యూట్యూబ్ లో క్షణాల్లో మనకు అందుబాటులో ఉంటుంది. అయితే ఏటేటా యూట్యూబ్ వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. క్షణం తీరిక దొరికినా యూట్యూబ్ ను ఓపెన్ చేస్తూనే ఉంటారు.

అయితే 2025లో యూట్యూబ్‌ లో ఎక్కువమంది ఏం చూశారని మీరు అనుకుంటున్నారు..? 2025 లో యూట్యూబ్‌ లో ట్రెండ్ అయిన వీడియోలు ఏంటి..? టాపిక్స్ ఏంటి..? టాప్ క్రియేటర్స్ ఎవరు..? ఇందుకు సంబంధించిన వివరాలను యూట్యూబ్ విడుదల చేసింది. 2025 లో టాప్ 10 ట్రెండింగ్ అంశాలను తాజాగా యూట్యూబ్ విడుదల చేసింది. ఆ వివరాలు చూస్తే.. స్క్విడ్ గేమ్ గురించి ఎక్కువమంది యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా ఉంది.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన కూలీ మూవీ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కుంభమేళా ఉంది. అలాగే ఐదోస్థానంలో ఐపీఎల్-2025 ఉంది. ఇక ఆరోస్థానంలో సనమ్ తేరి కసమ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆసియా కప్, తుంగ్టుంగ్టుంగ్సహు, లబుబు నిలిచాయి. అలాగే 2025 లో యూట్యూబ్ లో టాప్ 5 సాంగ్స్ లిస్టులో సైయారా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో రాను బొంబైకి రాను సాంగ్ ఉంది. ఆ తర్వాతి లిస్టులో షాకీ, తేరీ రాంజోల్ బోలో గి పాటలు ఉన్నాయి.

What India Watched Most on YouTube in 2025 Squid Game Saiyaara Coolie amp amp More Top Trends

అలాగే 2025 లో భారత్ లో టాప్ క్రియేటర్స్ లిస్టు చూస్తే.. ఇందులో మిస్టర్ బీస్ట్ తొలిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో సెజల్ గబా, మూడోస్థానంలో KIMPRO, నాలుగోస్థానంలో కేశవ్ శశి వ్లాగ్స్, ఐదోస్థానంలో తేరా ట్రిగన్ ఉన్నారు. అలాగే ఆరో ప్లేస్ లో సిర్ఫ్ శ్రేయాన్ష్, ఏడో స్థానంలో జిదాన్ షాహిద్ ఆలీ, ఎనిమిదో స్థానంలో KL BRO బిజు రిత్విక్ ఉన్నారు. ఇక చివరగా తొమ్మిదో స్థానంలో టెక్ మాస్టర్ షార్ట్స్ అలాగే పదో స్థానంలో రాజ్ షమానీ ఉన్నారు. ఈ మేరకు 2025 లో భారత్ లో టాప్ క్రియేటర్స్ లిస్టును యూట్యూబ్ విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+