వీర్యంలో శుక్రకణాలు ఈతకొట్టకుండా ఆపే ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏంటి ?

వీర్యంలో శుక్రకణాలు ఈత కొట్టకుండా ఆపగలిగే కణమార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్లతో సంబంధంలేకుండా పురుషుల సంతానోత్పత్తి నిరోధక మాత్రల తయారుచేయడంలో ఇది కీలక అడుగు అవుతుందని చెప్తున్నారు.
దీనికి సంబంధించి ఎలుకపై జరిపిన ప్రయోగాలలో శుక్రకణాలు అండాన్ని చేరుకోకుండా కొన్ని గంటల పాటు ఆపడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. మరింతగా దీనిపై ప్రయోగాలు చేయనున్నారు శాస్త్రవేత్తలు.
మనుషులపై ప్రయోగాలు చేయడానికి ముందు కుందేళ్లపైనా ఈ పరీక్షలు చేపడతారు.
మనుషులపై ప్రయోగాలు చేసేటప్పుడు.. ప్రయోగదశలో ఉన్న ఈ పురుష సంతాన నిరోధక మాత్రలను సెక్స్‌కు కొన్ని గంటల ముందు వేసుకున్నాక దాని ప్రభావం ఎన్ని గంటల వరకు ఉంటుందో చూస్తారు.
- Semen allergy: వీర్యం శరీరంపై పడితే దురద వస్తుందా? ఇది అలర్జీ కావచ్చు, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
- మనం ఎందుకు చనిపోతాం? పిల్లల్ని కనే శక్తే వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?

మహిళలు వేసుకునే గర్భనిరోధక మాత్రలలో హార్మోన్లు ఉంటాయి. కానీ, ఈ పురుష గర్భనిరోధక మాత్రలలో హార్మోన్లు ఉండవు.
హార్మోన్ రహిత మాత్రలు కావడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని.. హార్మోన్లు లేకపోవడం వల్ల పురుషుల్లోని టెస్టోస్టెరాన్‌పై ప్రభావం పడడం, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడంలాంటివి జరగవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
శుక్రకణాలకు సంకేతాలు అందడంలో తోడ్పడే ప్రోటీన్ అయిన సాల్యుబుల్ అడినలిల్ సైక్లేస్(ఎస్ఏసీ)ను లక్ష్యంగా చేసుకుని ఈ మందు పనిచేస్తుంది.
ఈ మాత్ర వేసుకుంటే ఎస్ఏసీ నుంచి సంకేతాలు అందకుండా బ్లాక్ చేస్తుంది.
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- 'వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు పెరుగుతాయ్’

అంతకుముందు యూఎస్ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ఎలుకలపై చేసిన అధ్యయనంలో 'టీడీఐ 11861’ అనే ఈ మందును ఎలుకలపై ప్రయోగించారు.
ఈ మాత్ర వేసుకున్న తరువాత సెక్స్‌కు ముందు కానీ, సెక్స్ సమయంలో కానీ, సెక్స్ తరువాత కానీ వీర్య కణాల కదలికలు ఆగిపోయాయి.
ఈ మాత్ర ప్రభావం సుమారు 3 గంటల పాటు ఉంది. దీని ప్రభావం పూర్తిగా తొలగడానికి 24 గంటలు పట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ మాత్ర వేసుకుంటే వీర్య కణాల కదలిక పూర్తిగా ఆగిపోదని, మాత్ర ప్రభావం ఉన్నంత వరకే కదలిక ఆగుతుందని, తరువాత మామూలైపోతుందని, దీన్ని సులభంగా వాడుకోవచ్చని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సైంటిస్ట్ డాక్టర్ మెలానీ చెప్పారు.
ఇది మనుషుల్లోనూ ఇలాంటి ఫలితాలే ఇస్తే అప్పుడు పురుషులు దీన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చని చెప్పారు. సంతానోత్పత్తికి సంబంధించి నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చన్నారు.
- యోనికి లేజర్ చికిత్స చేస్తే శృంగారంలో నొప్పి తగ్గి లైంగిక సంతృప్తి పెరుగుతుందా
- దోశల పెనంపై కోటింగ్ కారణంగా వీర్య కణాల ఉత్పత్తి పడిపోతుందా

లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వదు
ఇది కేవలం సంతాన నిరోధక మాత్ర మాత్రమే అని, ఇది వేసుకోవడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఉండదని చెప్పారు మెలానీ.
లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కావాలంటే కండోమ్ వాడడమే సరైన మార్గమని చెప్పారు.
కాగా మరికొందరు పరిశోధకులు వీర్యం ఉపరితలంపై ఉండే మరో ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా సంతానోత్పత్తి నిరోధక మాత్రలను తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- గుజరాత్: నదిలో కూలిన కేబుల్ బ్రిడ్జి... ప్రమాదంలో 60 మంది మృతి
- సమంత: 'నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- INDvsSA: 5 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా... ఓడిపోయిన భారత్
- తిరుమలలో నవంబర్ 1 నుంచి టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం, ఇది భక్తులకు ఎంత ఉపయోగం
- క్యూబా జనాభా 25 ఏళ్లుగా ఎందుకు పెరగడం లేదు... కారణాలేంటి, పరిణామాలు ఎలా ఉంటాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications