ఇండియా భారత్ అయితే ఇన్ని మారాలా ? తీవ్ర గందరగోళం తప్పదా ?

ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బ్రిక్స్ సదస్సు, జీ20 సదస్సుకు హాజరయ్యే అతిధులకు పంపిన ఆహ్వానాల్లో "ప్రెసిడెంట్ ఆఫ్ భారత్", "ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్" అంటూ పేర్కొన్న కేంద్రం.. ఇక అధికారికంగానే త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో ఇండియా పేరు భారత్ అయితే ఏమేం మారతాయన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇండియా పేరు భారత్ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ప్రస్తావించిన 'ఇండియా, అలియాస్ భారత్' వాక్యాల్ని మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్, ఇండియా పదాలు కేవలం వివరణాత్మకమైనవే తప్ప రెండింటినీ పరస్పరం ఒకదాని బదులుగా మరొకటి వాడలేమని రాజ్యాంగ నిపుణుడు పిడిటి ఆచారి తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుండి పేరులో ఏదైనా మార్పు చేయాలంటే రాజ్యాంగానికి అనేక సవరణలు అవసరమని వెల్లడించారు.

what will be changed if india renamed as bharat ? from constitution to UNO

మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ కూడా అయిన ఆచారి... రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఆర్టికల్ 1 మార్చవలసి ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా మిగతా అన్నింటినీ మార్చాల్సి ఉంటుందన్నారు. ఇండియా అనే పేరు ఎక్కడెక్కడ వాడుతున్నారో అన్నీ మార్చాలన్నారు. అలాగే విదేశాల్లో పాపులర్ అయిపోయిన ఇండియా పేరును ఆయా దేశాల పత్రాలన్నింటిలోనూ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దేశంలోనే కాకుండా వెలుపల కూడా చాలా గందరగోళాన్ని సృష్టిస్తుందని ఆచారి తెలిపారు.

అలాగే ఐక్యరాజ్యసమితిలో భారతదేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంది. రేపు రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని రాయాల్సి వస్తే, రాజ్యాంగాన్ని సవరించడంతో పాటు అన్ని దేశాలకూ సమాచారం ఇవ్వాలి. మా దేశం పేరు మార్చిందని వారికి తెలపాలి.
ఆ మార్పును రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావాలి, లేకుంటే ఇండియా పేరు ఇండియా మాత్రమే ఉంటుందన్నారు. ఆర్టికల్ 1లో రాసిన భారత్ అనే భారతదేశం కేవలం వివరణాత్మకమైనదని, ఈ రెండూ పరస్పరం మార్చుకోగలవని కాదన్నారు. వాటిని ఉపయోగించడం ఆత్మహత్యే అవుతుందన్నారు. ఎక్కడైనా ఒక దేశానికి ఒకే పేరు ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+