ఇన్ మెమరీస్: మనవడు బ్యాటింగ్ చేస్తే.. కరుణానిధి బౌలింగ్ చేశారిలా(వీడియో)
చెన్నై: డీఏంకే పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్తగానే అందరికీ తెలుసు. కానీ, ఆయన గొప్ప క్రీడాభిమాని కూడా. ఆయనకు మనదేశంలో చాలా మంది అమితంగా ఇష్టపడే క్రికెట్ అంటే చాలా ఇష్టమట.
అందుకే కరుణానిధి అస్వస్థతకు గురి కావడానికి ముందు.. తన ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్ ఛైర్‌లోనే కూర్చొని క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ ఆయన బాగా బౌలింగ్ చేశారు.

తన మనవడిని తికమక పెట్టేందుకు ఆయన స్పిన్ చేస్తూ బంతులను సంధించారు. మనవడు కూడా తాతకి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. కరుణానిధి మరణం నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన కరుణ మంగళవారం సాయంత్రం 6:10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మరణంతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు కరుణ మృతి పట్ల సానుభూతి ప్రకటించారు.












Click it and Unblock the Notifications