ఆసక్తికర సన్నివేశం: మోడీ, అఖిలేష్, ములాయం కలిశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు కరచాలనం చేసుకున్నారు.

యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!

ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకున్నారు. ఇప్పుడు అదే నేతలు ఒకే వేదికపై కనిపించడంతో పాటు ఆలింగనాలు చేసుకొని, అభినందించుకున్నారు.

mulayam singh yadav - narendra modi

యోగి ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ములాయం సింగ్‌, అఖిలేశ్‌యాదవ్‌ కలిశారు. ఆయనతో కరచాలనం చేసి నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌(44)గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. లక్నోలోని కాన్షీరామ్‌ స్మృతి ఉపవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం: కేబినెట్లో మైనార్టీకి ఛాన్స్, హాజరైన అఖిలేష్

ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రులుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదిత్యనాథ్‌ యూపీకి 21వ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం పదవిని చేపట్టిన వారిలో ఆయన నాలుగో వ్యక్తి. ఆయనకు ముందు పార్టీకి చెందిన కల్యాణ్‌సింగ్‌, రామ్‌ ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi may have been the Samajwadi Party's rival during the election campaign, but today he made Akhilesh and Mulayam Singh Yadav bury the hatchet and shake hands.
Please Wait while comments are loading...