ఐదు కిడ్నీలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆ వ్యక్తి ఎవరు.. ఏంటా స్టోరీ?

సాధారణంగా మ‌నిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? ఎవ‌రికైనా రెండే ఉంటాయి. ఎవరిని అడిగిన ఇదే సమాధానం చెబుతారు. అయితే అరుదుగా ఒకే కిడ్నీతో జన్మించినవారు కూడా ఉంటారు. కానీ ఓ వ్యక్తి శరీరంలో ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. పుట్టుకతో ఆయనకి రెండు కిడ్నీలే ఉన్నా.. మరో మూడు మాత్రం దాతలు ఇచ్చినవి. అసలు ఆయన ఎవరు.. ఆ ఐదు కిడ్నీల స్టోరీ ఏంటో.. తెలుసుకుందాం...

ఐదు కిడ్నీలు ఉన్న వ్యక్తిగా పేరు పొందుతున్నారు భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న దేవేంద్ర బార్లెవార్‌. ప్రస్తుతం ఆయన వయస్సు 47. ఆయన శరీరంలో ఇప్పుడు ఐదు మూత్రపిండాలు ఉన్నాయి. కిడ్నీలు చెడిపోతే ఒక్కసారి మాత్రమే డొనర్‌ దొరకడమే కష్టం అయిన ఈ రోజుల్లో.. ఈ సైంటిస్ట్ కి ఏకంగా ఏకంగా మూడు సార్లు దొరికారు.

who is surprising everyone with five kidneys What is the story

బార్లెవార్‌ చాలా కాలంగా క్రోనిక్‌ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారు. ఆయనకు రెగ్యులర్‌గా డయాలసిస్ అవసరం అయింది. ఆ తర్వాత ఆయన తొలిసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. అప్పుడు ఆయన తల్లి కిడ్నీని దానం చేశారు. ఆ కిడ్నీ ఓ ఏడాది పాటు పనిచేసింది. ఆ తర్వాత మళ్లీ డయాలసిస్ అవసరం వచ్చింది. దీంతో 2012లో ఆయన రెండో సారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. రెండో సారి అతని బంధువుల్లో ఒకరు కిడ్నీ దానం చేశారట.

ఇక 2022 వరకు ఆ కిడ్నీ బాగా పనిచేసింది. అయితే బార్లెవార్‌ కోవిడ్‌ బారిన పడటంతో కరోనా వైరస్‌ ఆయన కిడ్నీపై ప్రభావం చూపించింది. దీంతో మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు. ఈ సారి కిడ్నీ ఇచ్చేందుకు ఎవరు దొరకలేదు. 2023లో ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌తో మరణించడంతో ఆయన కిడ్నీ బార్లెబార్‌కు సరిపోలడంతో ఢిల్లీలోని ఫరీదాబాద్లో గల అమృత హాస్పిటల్‌ వైద్యులు మూడోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు.

కానీ ఆయన బాడీలో నాలుగు కిడ్నీలు ఉండటంతో ఐదో కిడ్నీని ఎక్కడ పెట్టాలనే సవాల్‌ కూడా వైద్యులకు ఎదురైంది. అయినా కూడా అమృత హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, యూరాలజీ డాక్టర్‌ అనిల్‌ శర్మ సాహసం చేశారు. జనవరి 9న నాలుగు గంటల పాటు శ్రమించి బార్లెవార్‌కు ఆపరేషన్‌ చేశారు. అదృష్టవశాత్తు ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఆపరేషన్‌ తర్వాత వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న బార్లెబార్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు. మూడు నెలల విశ్రాంతి తర్వాత బార్లెబార్‌ తన రోజు వారి పనులు సాధారణంగా చేసుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+