వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన వారు ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
క్యాపిటల్ హిల్ భవనంలో నిరసనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి హాజరైన తర్వాత క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారులెవరు?

క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారుల్లో కొంత మంది కొన్ని వర్గాలకు, అభిప్రాయాలకు ప్రతీకగా ఉన్న గుర్తులు, జెండాలను పట్టుకుని ఉన్నారు.

నిరసనకారుల చిత్రాలను పరిశీలిస్తే అందులో రైట్ వింగ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు, ఆన్‌లైన్‌లో వివాదాస్పద సిద్ధాంతాలకు మద్దతు పలికే వారు, ట్రంప్‌కు మద్దతుగా చేసే ర్యాలీలలోనూ, ఆన్‌లైన్ లోనూ యాక్టివ్ గా ఉన్నవారు కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక చిత్రంలో ముఖానికి పెయింటింగ్ వేసుకుని, జూలు టోపీ, కొమ్ములు పెట్టుకుని,అమెరికా జాతీయ జెండాను పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనను జేక్ ఏంజెలిగా గుర్తించారు. ఆయనను కేనన్ (QAnon) అనే నిరాధారమైన ఒక వివాదాస్పద సిద్ధాంతానికి మద్దతుదారునిగా గుర్తించారు. ఆయనను తనను తాను 'కేనన్ షమన్' అని పిల్చుకుంటారు.

కొందరు నిరసనకారులు ప్రత్యేక దుస్తులు, ముఖానికి రంగులతో వచ్చారు

ఆయన చాలా కేనన్ కార్యక్రమాలకు హాజరైనట్లు ఆయన సోషల్ మీడియా పోస్టులు తెలియచేస్తాయి. ఆయన దేశానికి సంబంధించిన తీవ్రమైన కుట్రల గురించి యూట్యూబ్ లో వీడియోలు కూడా పోస్టు చేస్తారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ అరిజోనలోని ఫీనిక్స్ లో నవంబరులో నిరాధారమైన ప్రసంగం చేస్తుండగా ఒక ఫోటో తీశారు. ఆయన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా కూడా తీవ్రమైన భావజాలం, కుట్ర సిద్ధాంతాలతో కూడిన చిత్రాలు, మీమ్ లతో నిండిపోయి ఉంది.

తనను తాను ప్రౌడ్ బాయ్ ఎల్డర్‌గా చెప్పుకునే నిక్ ఓక్స్ (కుడి)

ది ప్రౌడ్ బాయ్స్

క్యాపిటల్ భవనాన్ని ముట్టడి చేసిన మరో బృందంలో రైట్ వింగ్ కి చెందిన 'ప్రౌడ్ బాయ్స్' అనే బృందం కూడా కనిపించింది. ఈ గ్రూపును 2016లో స్థాపించారు. వీరు వలసదారులకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు ఈ బృందంలో అందరూ పురుషులే ఉన్నారు. శ్వేత జాతీయుల జాత్యహంకారం గురించి మిలీషియా గురించి ట్రంప్ చేసిన తొలి అధ్యక్ష ప్రసంగంలో "ప్రౌడ్ బాయ్స్ బృందం గురించి ప్రస్తావిస్తూ వారెప్పుడూ తన వెంట, తన వైపు నిలబడతారు" అని సమాధానం చెప్పారు. ఆ బృందానికి చెందిన నిక్ ఆక్స్ భవనం లోపల తీసుకున్న సెల్ఫీతో కలిపి "క్యాపిటల్ నుంచి హలో, లోల్ " అంటూ ట్వీట్ చేశారు. ఆయన భవనం లోపల నుంచి లైవ్ స్ట్రీమ్ కూడా చేశారు. ఈ చిత్రంలో ఎడమ వైపు నిల్చున్న వ్యక్తిని మేము గుర్తించలేకపోయాం. టెలిగ్రామ్ యాప్లో ఆక్స్ ప్రొఫైల్ లో ఆయన "హవాయికి చెందిన ప్రౌడ్ బాయిస్ బృందంలో" ప్రథముడు అని ఉంటుంది.

కాన్ఫెడరేట్ జెండాతో యూఎస్ క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకొచ్చిన నిరసనకారుడు

ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు

ఈ నిరసనల్లో ఆన్‌లైన్లో భారీగా అనుచరులు ఉన్న వ్యక్తులు కూడా కనిపించారు. అందులో టిమ్ జియోనెట్ అనే సోషల్ మీడియా పర్సనాలిటీ కూడా ఉన్నారు. ఆయన "బేక్డ్ అలస్కా" అనే మారు పేరుతో అకౌంటును నిర్వహిస్తున్నారు.

ఆయన ఒక సముచితమైన స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ద్వారా క్యాపిటల్ భవనం నుంచి లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోను కొన్ని వేల మంది చూసారు. ఆ వీడియోలో ఆయన ఇతర నిరసనకారులతో మాట్లాడుతూ కనిపించారు.

ఆయనకు ట్రంప్ మద్దతుదారుగా ఇంటర్నెట్లో ట్రోల్ చేస్తారనే పేరు ఉంది. ఆయనను శ్వేత జాతీయవాదిగా సథర్న్ పావర్టీ లా సెంటర్ అనే అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్థ అభివర్ణించింది. అయితే, దీనిని ఆయన 'ది ఇన్సైడర్'తో చేసిన కామెంటు లో ఖండించారు.

ఆయన షాపుల్లో పని చేసే కార్మికులను వేధిస్తున్నట్లు, కరోనావైరస్ వ్యాప్తి సమయంలో ఫేస్ మాస్కు ధరించకుండా ఉన్న వీడియోలను పోస్టు చేసిన తర్వాత యూ ట్యూబ్ అతని ఛానెల్ ను అక్టోబరులో నిషేదించింది. అంతకు ముందే ట్విటర్, పే పాల్ కూడా అతని అకౌంట్లను నిషేధించాయి.

స్పీకర్ నాన్సీ పెలోసీకి మేం వెనక్కి వెళ్లేది లేదు అనే మెసేజ్ రాసిన రిచర్డ్ బార్నెట్

నాన్సీ పెలోసీకి నోటు ఎవరు రాశారు?

సీనియర్ డెమొక్రాట్ నాయకురాలు న్యాన్సీ పెలోసి ఆఫీసులోకి దూసుకుని వెళ్లిన వ్యక్తిని అర్కాన్సాస్ కి చెందిన రిచర్డ్ బార్నెట్ అని తేల్చారు.

ఆయన స్పీకర్ ఆఫీసు నుంచి ఒక కవరు తీసుకుని అందులో ఆమెను అసభ్యకర పదజాలంతో దూషించినట్లు క్యాపిటల్ హిల్ భవనాల వెలుపల నిలబడి న్యూ యార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"ఈ చర్యలన్నిటినీ ఒక నియమాధికారాలు ఉన్న ఒక వ్యక్తి ప్రేరేపించడం చాలా అనారోగ్యకరంగా ఉంది" అని రిపబ్లిక్ కాంగ్రెస్ సభ్యుడు స్టీవ్ వుమాక్ ట్విటర్లో ట్వీట్ చేశారు.

బార్నెట్ తుపాకీ హక్కులను సమర్ధించే ఒక గ్రూపుతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత "స్టాప్ ది స్టీల్" అనే ర్యాలీ దగ్గర ఆయనను ఇంటర్వ్యూ కూడా చేశారు. జో బైడెన్ విజయాన్ని ఆమోదించకుండా ఉండేందుకు వీరు ఈ గ్రూపు ద్వారా ఉద్యమం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అవకతవకలు జరిగాయని ట్రంప్ చేస్తున్న నిరాధార వ్యాఖ్యలను వీరు సమర్థిస్తున్నారు. "మీకు నచ్చకపోతే నన్ను పట్టుకోవడానికి ఎవరినైనా బయటకు పంపించండి. నేనంత సులభంగా తగ్గేవాడిని కాదు" అని అంటూ ఆయన "ఎంగేజ్డ్ పేట్రియాట్స్ " అనే బృందం నిర్వహించిన ర్యాలీ దగ్గర ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.

బార్నెట్ కు సంబంధం ఉన్న ఒక గ్రూపు అక్టోబరులో నిధులను కూడా సేకరించింది. ఈ నిధులతో స్థానిక పోలీసులకు బాడీ కెమెరాలు కొంటామని చెప్పినట్లు వెస్ట్ సైడ్ ఈగిల్ ఆబ్సర్వర్ అనే స్థానిక పత్రిక రాసింది.

రిపోర్టింగ్: జాక్ గుడ్ మన్ , క్రిస్టోఫర్ గైల్స్, ఓల్గా రాబిన్సన్, షయాన్ సర్దారిజాదే

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Trump supporters storm into US Capitol Hill building
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X