Wife: బ్లూటీపార్లల్ లో భార్య, డ్రెస్ కోడ్ తో భేజారు. రెండు రాష్ట్రల మ్యద నిలబెట్టి నరికేశాడు !

చెన్నై/ కన్యాకుమారి: యువతి, యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు దంపతులు వేరుగా నివాసం ఉంటూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య పుట్టింటికి వెళ్లిన భర్త అక్కడే భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య బ్యూటీపార్లల్ కు వెలుతోంది. భార్య తీరుతో భర్త రగిలిపోయాడు. బ్యూటీపార్లల్ కు వెలుతున్న భార్య వేసుకుంటున్న డ్రెస్ లు చూసి భర్త ఆసహనంతో ఆవేదన చెందాడు. ఇదే వియంలో దంపతుల మద్య గొడవ జరిగింది. భార్యను నమ్మించి బయటకు పిలుచుకుని వెళ్లిన భర్త రెండు రాష్ట్రాల మద్య భార్యను నిలబెట్టి ఆమెను అడ్డంగా నరికేశాడు.

 ప్రేమికులు

ప్రేమికులు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మూలచ్ ప్రాంతంలో జెబాసింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జెబాసింగ్ కు జెబా బింస్రా అలియాస్ బింస్రా (32) అనే కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం బింస్రా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎబినేషన్ అలియాస్ ఎబి అనే యువకుడిని ప్రేమించింది.

 లవ్ మ్యారేజ్..... ఇద్దరు పిల్లలు

లవ్ మ్యారేజ్..... ఇద్దరు పిల్లలు

కొన్ని సంత్సరాల క్రితం బింస్రా, ఎబి పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న బింస్రా, ఎబి కన్యాకుమారిలో కాపురం పెట్టారు. ఎబి, బింస్రా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టే వరకకు ఎబి, బింస్రా దంపతులు బంధువులు, స్నేహితులతో కలుస్తూ చాలా సంతోషంగా ఉండేవారని తెలిసింది.

 అత్తారింటిలో కాపురం.... బ్యూటీపార్లల్ కు భార్య

అత్తారింటిలో కాపురం.... బ్యూటీపార్లల్ కు భార్య

పిల్లలు పుట్టిన తరువాత కూడా దంపతులు సంతోషంగా ఉన్నాడు. ఇదే సంవత్సరం ఎబి అతని భార్య బింస్రా పుట్టింటికి వెళ్లి అక్కడే అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మూడు నెలల నుంచి ఎబి భార్య బింస్రా కేరళలోని తిరువనంతపురంలోని బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చెయ్యడాకి వెలుతోంది.

 భార్య వేసుకునే డ్రెస్ లు చూసి ?

భార్య వేసుకునే డ్రెస్ లు చూసి ?

బ్యూటీపార్లల్ కు వెలుతున్న బింస్రా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది. ఖరీదైన దుస్తులు, వెరైటీ దుస్తులు వేసుకుంటున్న బింస్రా బ్యూటీ ప్యార్లెల్ కు వెళ్లి వస్తోంది. నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ మార్చాని ఎబి అతని భార్య బింస్రాకు చెబుతూనే ఉన్నాడు. అయితే బింస్రా మాత్రం ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో ఆమె భర్త ఎబి రిగిలిపోయాడు.

 రెండు రాష్ట్రాల మద్య నిలబెట్టి నరికేసిన భర్త

రెండు రాష్ట్రాల మద్య నిలబెట్టి నరికేసిన భర్త

గురువారం రాత్రి 10 గంటలకు ఎబి అతని భార్య బింస్రాను బైక్ లో కుర్చోబెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యంలో ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సందర్బంలో కేరళ- తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బైక్ నిలిపిన ఎబి ముందుగా పొదల్లో దాచిపెట్టిన కొడవలి బయటకు తీసి అతని భార్య బింస్రా తల, మెడ తదితర ప్రాంతాల్లో నరికి దారుణంగా చంపేశాడు. బింస్రా శవాన్ని తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+