Wife: ఫ్యాన్సీస్టోర్ లో ఎల్ఐసీ ఏజెంట్ భార్యను ?, పక్కాప్లాన్ తో, 3 నిమిషాల్లో క్రికెట్ బ్యాట్, కత్తులు !

బెంగళూరు/ కోలారు/కేజీఎఫ్: ఫ్యాన్సీ స్టోర్ యజమాని అయిన మహిళను ఆమె ఫ్యాన్సీ స్టోర్ లో అతి దారుణంగా హత్య చేశాడు. ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఆమెను భర్త వదిలి వెళ్లిన కేవలం 3 నిమిషాల్లో ఆమె దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఫ్యాన్సీ స్టోర్ లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో ఆమె తల పగలగొట్టడం, కూరగాయల కత్తితో ఆమె గొంతు పూర్తిగా కోసేసి హత్య చెయ్యడం కలకలం రేపింది. ఎల్ఐసీ ఏజెంట్ అయిన ఆమె భర్త ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. పట్టపగలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోని ఫ్యాన్సీ స్టోర్ లోనే మహిళ హత్యకు గురి కావడం కలకలం రేపింది. యవ్వనంలో ఉన్న మహిళను అంతదారుణంగా హత్య చెయ్యడం అనేక అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు అంటున్నారు.

ఫ్యాన్సీ స్టోర్ యజమాని

ఫ్యాన్సీ స్టోర్ యజమాని

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు పట్టణం చాలా పెద్దది. పేరుకు కోలారు కర్ణాటకలో ఉన్నా అక్కడ 80 శాతం మంది మాట్లాడేది తెలుగు బాష. కోలారులోని మహాలక్ష్మి లేఔట్ లో నీలవేణి (29) అనే మహిళ సొంతంగా ఫ్యాన్సీస్టోర్ నిర్వహిస్తోంది. కోలారు తాలుకాలోని నాగనాయకనహళ్ళి నివాసి అయిన నీలవేణి ప్రతిరోజు సొంత ప్యాన్సీస్టోర్ లో వ్యాపారం చేస్తోంది.

భర్త ఎల్ఐసీ ఏజెంట్

భర్త ఎల్ఐసీ ఏజెంట్

నీలవేణి భర్త ఎల్ఐసీ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి నీలవేణి మహాలక్ష్మి లేఔట్ లోనే ఫ్యాన్సీస్టోర్ నిర్వహిస్తూ స్థానికులకు చాలా దగ్గర అయ్యింది. ప్రతిరోజు ఉదయం నీలవేణిని ఆమె భర్త ఫ్యాన్సీస్టోర్ దగ్గర వదిలిపెట్టి వెలుతాడు. రాత్రి మళ్లీ నీలవేణిని ఆమె భర్త బైక్ లో ఇంటికి పిలుచుకుని వెళ్లడం ఆనవాయితిగా వస్తోంది.

 మూడు నిమిషాల్లో అరాచకం

మూడు నిమిషాల్లో అరాచకం

ఉదయం 10.30 గంటల సమయంలో నీలవేణిని ఆమె భర్త ఫ్యాన్సీస్టోర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడు. ఫ్యాన్సీస్టోర్ షాప్ తాళం తీసిన నీలవేణి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులు సర్దుతోంది. అదే సమయంలో లోపలికి వెళ్లిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఫ్యాన్సీస్టోర్ లోని క్రికెట్ బ్యాట్ తో నిలవేణిని తల మీద దాడి చేశారు. అదే ఫ్యాన్సీస్టోర్ లో ఉన్న కత్తులు తీసుకుని నీలవేణి గొంతు కోసి దారుణంగా చంపేసి ప్యాన్సీస్టోర్ షట్టర్ కిందకు దించేసి అక్కడి నుంచి దర్జాగా బైక్ ల్లో పరారైనారు.

వెంటనే భర్త ఫోన్

వెంటనే భర్త ఫోన్

ఉదయం 10.45 గంటల సమయంలో నీలవేణికి ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆరుసార్లు ఫోన్ చేసినా నీలవేణి ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఆమె భర్త పక్కషాప్ లోని వ్యక్తికి ఫోన్ చేశాడు. తన భార్యకు ఫోన్ ఇవ్వాలని మనవి చేశాడు. పక్కషాప్ వ్యక్తి మొబైల్ ఫోన్ ఇవ్వడానికి వెళ్లి చూడగా ఫ్యాన్సీస్టోర్ షట్టర్ పూర్తిగా కిందకు దించేసి ఉండటంతో ఆ విషయం నీలవేణి భర్తకు చెప్పాడు.

సీసీటీవీ కెమెరాల్లో

సీసీటీవీ కెమెరాల్లో


నీలవేణి భర్త భయంతో ఫ్యాన్సీస్టోర్ దగ్గరకు వచ్చి షట్టర్ తీసి చూడగా అప్పటికే నీలవేణి రక్తపు మడుగులో ప్రాణం విడిచిన విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో పరిశీలించి వివరాలు సేకరించారు. పట్టపగలు కోలారు పట్టణంలో ఫ్యాన్సీస్టోర్ యజమాని నీలవేణిని ఆమె షాప్ లోనే కిరాతకంగా హత్య చెయ్యడం కోలారులో కలకం రేపింది.

అలాంటివి ఏమైనా ?

అలాంటివి ఏమైనా ?


నీలవేణిని కలవడానికి ఎక్కువగా ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ?, ఆమె ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడుతోంది ?. నీలవేణి భర్తకు ఏమైనా అలవాట్లు, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ?, వీరి సంసారం ఎలాసాగుతోంది? అంటూ అనేక కోణాల్లో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నీలవేణి ఫ్యాన్సీ స్టోర్ లోకి ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లిన విషయం ఎదురుగా ఉన్న మరో షాప్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, హంతకుల ఆచూకి చిక్కిందని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని కోలారు జిల్లా ఎస్పీ, ఆ పట్టణ పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+