అచ్చు సినిమాల్లో లాగే!.. గర్భవతినంటూ భర్తకు ఎంత షాక్ ఇచ్చిందంటే?
పద్మిని గర్భవతి నాటకానికి తెరలేపి భర్తను నమ్మిస్తూ.. ప్రసవం దాకా వచ్చింది. క్లైమాక్స్ లో సీన్ బెడిసి కొట్టి భర్త పోలీసులను సంప్రదించడంతో.. భార్య గుట్టు రట్టయింది.
కెకెనగర్: వరకట్న వేధింపులు తప్పించుకోవాలంటే.. అర్జంటుగా ఓ బాబునో.. పాపనో కనేయాలన్న ఆలోచన వచ్చింది ఆమెకు. ఆలోచన రావడమే ఆలస్యం.. గర్భవతిని అయ్యానంటూ భర్తను నమ్మించింది. ప్రతీ నెల తల్లితో కలిసి చెకప్ లకు వెళ్తున్నట్లు నాటకాన్ని రక్తి కట్టించింది. ఒకవేళ భర్త వస్తానంటే మాత్రం.. ఏదో ఒక కారణం చెప్పి అతన్ని రాకుండా చేసేది.
కొన్ని నెలలకు పుట్టింటివారు ఆమెకు సీమంతం కూడా జరిపించారు. ఆ సమయంలో చాలామంది ఆమె గర్భంపై అనుమానాలు వ్యక్తం చేసినా.. అందరూ నమ్మేలా సమాధానం చెబుతూ వచ్చారు. తమ వంశంలో అందరికి ఇలాగే ఉంటుందని, గర్భం పైకి అంతగా ఏర్పడదని నమ్మించారు. ఇదే క్రమంలో ఇటీవల తనకు ఆడపిల్ల పుట్టిందని భార్య నుంచి ఫోన్ వచ్చింది. బిడ్డను చూడటానికి వెళ్లిన భర్తకు ముందునుంచే అనుమానం తొలస్తుండటంతో.. దీనిపై ఆరా తీయగా అసలు నిజాలు బయటపడ్డాయి.
అచ్చు సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కీళ్పాక్కం రిటైర్ట్ కమిషనర్ సోమన్ కుమారుడు యోగేశ్వరన్ కు.. ఫిబ్రవరి 14,2016న పద్మినితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే పద్మిని పట్ల అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులకు ఫుల్ స్టాప్ పడాలంటే.. తొందరగా ఓ పాపను కని వారి చేతుల్లో పెట్టాలని బంధువులు సలహా ఇచ్చారు.

దీంతో పద్మిని గర్భవతి నాటకానికి తెరలేపి భర్తను నమ్మిస్తూ.. ప్రసవం దాకా వచ్చింది. క్లైమాక్స్ లో సీన్ బెడిసి కొట్టి భర్త పోలీసులను సంప్రదించడంతో.. భార్య గుట్టు రట్టయింది. ఆ చంటిబిడ్డ పద్మినికి పుట్టింది కాదని, అసలు ఆమె గర్భవతే కాదని పోలీసులు నిర్దారించారు. పోలీసులకు శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ చంటిబిడ్డను ఎక్కడినుంచి తీసుకొచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
బిడ్డ ఏ ఆసుపత్రిలో పుట్టింది?, వాటి ఆధారాలు చూపించండి? అంటూ పోలీసులు ప్రశ్నించడంతో పద్మిని నిజం ఒప్పుకోక తప్పలేదు. తన మెడలోని 17సవర్ల బంగారు తాళిని అమ్మి ఉత్తరాదికి చెందిన ఓ జంట నుంచి బిడ్డను కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. పిల్లల కోసం భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేకనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించింది.












Click it and Unblock the Notifications