Wife: నా భార్యను చంపేశానని మొబైల్ లో మెసేజ్ పంపించిన భర్త, దర్జగా మద్యం సేవిస్తూ, ఏం జరిగిందంటే !
కొచ్చి/ మల్లప్పురం: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెతో సంతోషంగా జీవినం సాగించాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు ఎంత చెప్పినా దంపతులు ఇద్దరూ తూర్పూ, పడమరలాగా ఎవరిపాటి వారు ప్రవర్తించారు. రానురాను దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న భర్త రోజూ మద్యం సేవిస్తూ ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన భార్య ఎంతచెప్పినా మాట వినడంలేదని రగిలిపోయిన భర్త కన్న బిడ్డల ముందే అతని భార్యను చంపేశాడు. నా భార్యను చంపేశాను అంటూ స్నేహితులను మొబైల్ లో మెసేజ్ పంపించిన భర్త ఓ నిర్జన ప్రదేశంలో మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కిపోయాడు.

10 సంవత్సరాల క్రితం !
కేరళలోని మల్లప్పురం జిల్లాలోని వాజక్కడ్ లో మోహమ్మద్ షమీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం మోహమ్మద్ షమీర్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన షకీరా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మోహమ్మద్ షమీర్ వివాహం జరిగిన తరువాత అతని భార్య షకీరాతో సంతోషంగా జీవినం సాగించాడు.

దంపతులు తూర్పూ పడమర టైపు
మోహమ్మద్ షమీర్, షకీరా దంపతులకు 8 సంవత్సరాలు, ఆరు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మోహమ్మద్ షమీర్, షకీరా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు ఎంత చెప్పినా మోహమ్మద్ షమీర్, షకీరా దంపతులు ఇద్దరూ తూర్పూ, పడమరలాగా ఎవరిపాటి వారు ప్రవర్తించారు.

భార్య మీద అనుమానం ఎక్కువ
రానురాను మోహమ్మద్ షమీర్, షకీరా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భార్య షకీరా ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త మోహమ్మద్ షమీర్ రోజూ మద్యం సేవిస్తూ ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. బయటకు వెళ్లినట్లు నటించిన మోహమ్మద్ షమీర్ అతని భార్య షకీరా మీద నిఘా వెయ్యడం మొదలుపెట్టాడు.

భార్యను చంపేసి బంధువులకు మెసేజ్ చేసిన భర్త
తన భార్య షకీరా ఎంతచెప్పినా మాట వినడంలేదని మోహమ్మద్ షమీర్ రగిలిపోయాడు. మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మోహమ్మద్ షమీర్ కన్న బిడ్డల ముందే అతని భార్య షకీరాను చితకబాది తరువాత నైలాన్ తాడు తీసుకుని ఆమె గొంతు బిగించి చంపేశాడు. నా భార్య షకీరాను చంపేశాను అంటూ మోహమ్మద్ షమీర్ అతని బంధువులు, స్నేహితులను మొబైల్ లో మెసేజ్ పంపించి ఇంటి నుంచి పరారైనాడు.

మద్యం సేవిస్తూ కుర్చున్న భర్త
షకీరాను హత్య చేశానని మోహమ్మద్ షమీర్ పంపించిన మెసేజ్ చూసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య షకీరాను చంపేసిన అక్కడి నుంచి తప్పించుకున్న మోహమ్మద్ షమీర్ నిర్జనప్రదేశంలోకి వెళ్లి మద్యం సేవించాడు. మద్యం బాటిల్స్ కూడా మోహమ్మద్ షమీర్ పక్కనే ఉన్నాయి.

ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన భర్త
సివిల్ డ్రెస్ లో వెళ్లిన పోలీసులు మోహమ్మద్ షమీర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సివిల్ డ్రెస్ లో ఉన్నది పోలీసులు అని గుర్తించిన మోహమ్మద్ షమీర్ అక్కడి నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు మాత్రం అతన్ని వెంటాడని పట్టుకున్నారు. భార్య షకీరాను హత్య చేసిన తరువాత మద్యం సేవించి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించానని మోహమ్మద్ షమీర్ చెప్పాడని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications