Pepsi, Coca cola: రిలయన్స్ దెబ్బతో ధరలు తగ్గించనున్న కోకాకోలా, పెప్సీ.. !
ఒకప్పుడు ఫోన్ రిచార్జ్ చేసుకోవాలంటే.. రూ.10 లేదా రూ.20 లేకుంటే రూ.100 ఎక్కువగా రిఛార్జ్ చేసుకునేవారు. అన్ లిమిటేడ్ కావాలంటే.. భారీ మొత్తం చెల్లించాల్సిందే. ఇక ఇంటర్నెట్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ జియో రాకతో అంత మారిపోయింది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నెట్ కూడా కొద్ది రోజులు ఉచితంగా అందించింది. దీంతో ఎయిర్ టెల్, వోడాఫోన్ కూడా ధరలు తగ్గించాల్సి వచ్చింది. తర్వాత జియో ఉచితం ఎత్తివేసింది. క్రమంగా ఛార్జీలు వసూలు చేసింది.
అయినప్పటికీ ఇండియాలో మొబైల్ రిఛార్జ్ ధరలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం జియో అని చెప్పాలి. రిలయన్స్ జియో రాకతో భారత టెలికామ్ రంగంలో కీలక మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదే రిలయన్స్ పెప్సీ, కోకాకోలాకు షాక్ ఇస్తోంది. రిలయన్స్ కంపా కోలా తో పెప్సీ, కోకాకోలాకు పోటీని ఇస్తోంది. సాఫ్ట్ డ్రింక్ సెగ్మెంట్ లో గుత్తాధిపత్యం చేలాయిస్తోన్న పెప్సీ, కోకాకోలాకు షాకిచ్చింది. ధర తగ్గించి కంపా కోలాను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పెప్సీ, కోకాకోలా కూడా ధరలు తగ్గించాలని భావిస్తున్నాయి.

ఈ రెండు కంపెనీలు 15 నుంచి 20 శాతం వరకు ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర లీటర్ కంపా కోలాకు రూ.20 ఉంటే.. అదే అర లీటర్ కోక్ కు రూ.30 ఉంది. అర లీటర్ పెప్సీకి రూ.40 ఉంది. దీంతో వీరు ధరలు తగ్గించడం అనివార్యం అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కంపా కోలా అంత ఫేమస్ కానప్పటికీ.. రిలయన్స్ భారీగా మార్కెటింగ్ చేస్తుందన్న అంచనాతో కంపా కోలా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెప్సీ, కోకాకోలా ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఇండియాలో కంపా కోలాదే పై చేయి.. కానీ పెప్సీ, కోకాకోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు రావడంతో కంపా కోలా అమ్మకాలు పడిపోయాయి. ఆ తర్వాత కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో రిలయన్స్ కంపా కోలాను కొనుగోలు చేసి రీ లాంచ్ చేసింది. రీ లాంచ్ చేయడమే కాదు.. ధరలు భారీగా తగ్గించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications