భర్తతో ఫ్రెండ్‌ను రేప్ చేయించింది: బ్లూఫిలిం చూపిస్తూ..

 Woman Allegedly Forces Friend to Have Sex With Husband
బెంగళూరు: భర్తతో ఓ మహిళను రేప్ చేయించిన ఉదంతం కర్నాటకలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఆ భార్య బాధితురాలికి బ్లూఫిలిం కూడా చూపించిందట. ఆమె ఆ బ్లూఫిలిం చూస్తున్న సమయంలో తన భర్తను లోపలకు పంపించి గడియ పెట్టిందట. దీంతో, సదరు భర్త బ్లూ ఫిలిం చూస్తూ ఆమె పైన అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గత నెల 27న జరిగింది.

కాగా, ఇంటి పక్కనున్న 26 ఏళ్ల యువతిని మరో మహిళ తన భర్తతో అత్యాచారం చేయించిన దారుణ సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగిన విషయం తెలిసిందే. అత్యాచారం చేసిన దిలీప్, ఆయన భార్య ఆశలను బెంగళూరులోని జాలహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.

అబ్బిగెరె సమీపంలోని పిళ్లన్న గార్డెన్‌కు చెందిన దిలీప్ పొరుగు ఇంట్లో కారు డ్రైవర్, ఆయన భార్య ఉండేవారు. 27న ఆశ తన భర్తను ఉసిగొల్పి బాధితురాలి పైన అత్యాచారం చేయించింది. విషయాన్ని ఎవరికైనా చెబితే నీకు, నీ బిడ్డకు ప్రాణహానీ ఉంటుందని బెదిరించారు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

బాధితురాలిని తన ఇంటికి రమ్మని ఆగస్టు 10వ తేదీన మరోసారి ఆశ ఆహ్వానించింది. బాధితురాలిని మరోసారి బెదిరించింది. ఈ విషయం తెలిసి బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిలీప్, ఆశలను అరెస్టు చేసినట్లు శనివారం తెలిపారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. కాగా, ఆశ, బాధితురాలు స్వలింగకాముకులని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+