లేడీ రౌడీ: తప్పు ఆమెదే.. అయినప్పటికీ ఇలా ఐరన్ రాడ్‌తో దాడి చేసింది
మొహాలీ: చండీగడ్‌లో రెండు కార్లు ఢీకొట్టడంతో అందులోని ఓ కారులో ఉన్న యువతి మరో వ్యక్తిపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. అందరూ చూస్తుండగానే ఆమె తన కారులోనుంచి బయటకు దిగి ఆ వ్యక్తిపై ఇనుప రాడుతో దాడి చేసింది. దాడి చేసిన మహిళను శీతల్ శర్మగా గుర్తించగా.. బాధితుడిని నితీష్ కుమార్‌గా గుర్తించారు. శీతల్ దాడికి పాల్పడటంతో నితీష్ చేతులకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం శీతల్‌దే తప్పు అని పోలీసులు నిర్థారించారు. తప్పు ఆమె వైపు ఉండి కూడా నితీష్ కుమార్‌పై దాడి చేసిందని పోలీసులు వెల్లడించారు. శీతల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంట్రో కారులో నితీష్ కుమార్ పీజీఐ నుంచి బల్టానాలో తమ బంధువులను డ్రాప్ చేసేందుకు బయలుదేరాడు. కారులో ఇద్దరు మహిళలు నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శీతల్ ఎస్ఎక్స్4లో అదే మార్గంలో ఎదురుగా వచ్చింది. ఆమెతో పాటు ఆమె బంధువు ఒకరు ఉన్నారు.

శీతల్ తన కారును రివర్స్ చేసుకుంటుండగా నితీష్ కారు వెనక నుంచి ఢీకొంది. అయితే వాస్తవానికి శీతల్ కారు రాంగ్ సైడ్‌లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నితీష్ కుమార్ కారు ఢీకొట్టగానే రాంగ్ సైడ్ ఉన్న శీతల్‌ను మందలించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహం తెచ్చుకున్న శీతల్ తన కారులో నుంచి ఐరన్ రాడ్ బయటకు తీసి నితీష్ పై దాడి చేసింది. గొడవ పెద్దదిగా మారుతుండటంతో అక్కడి స్థానికుడు పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా తాను చేసిని పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం శీతల్‌దే తప్పు అని చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications