పొరపాటు: గ్యాంగ్‌స్టర్ రవి పుజారీ భార్య అనుకొని టీచర్‌ను...
ముంబై: మాఫియా నాయకుడు రవి పుజారీ భార్య, కుమారుడిగా భావిస్తున్న ఇద్దరిని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారు పుజారీ భార్య, తనయుడు కాదని అధికారులు తెలిపారు.
2012లో అక్రమ డబ్బు వసూలు కేసులో శ్రీదేవి సంతోష్ పుజారీ, పేరు మీద మంగళూరు పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఆమె కుమారుడు ఆర్యన్. ఇదిలా ఉండగా, సోమవారం అబుదాబీ వెళ్లే విమానం ఎక్కేందుకు మహిళ వచ్చారు. వీరిపై అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, అధికారులు అదుపులోకి తీసుకున్న 42 ఏళ్ల మహిళ బొరివిలికి చెందిన ఉపాధ్యాయురాలు. ఆమెను పొరపాటుగా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పోలీసులు సదరు మహిళా ఉపాధ్యాయురాలిని, ఆమె తనయుడిని అనంతరం విడుదల చేశారు.
పొరపాటు ఇలా...
సదరు ఉపాధ్యాయురాలు తన పందొమ్మిదేళ్ల తనయుడు, భర్తతో పాటు అబుదాబీకి వెళ్తోంది. ఆమెను ఇమ్మిగ్రేషన్ వద్ద ఆపేశారు. అయితే, రవి పుజారీ భార్య పేరు ఆమె పేరు దగ్గరగా ఉండటంతో ఈ పొరపాటు జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె తనయుడి పేరు కూడా పుజారీ తనయుడి పేరుకు దగ్గరగా ఉంది. దీంతో అదుపులోకి తీసుకొని విచారించారు.












Click it and Unblock the Notifications