సంపన్నులే ఆమె టార్గెట్: డ్రగ్స్ ఇచ్చి అశ్లీల వీడియోలు, డబ్బు కోసం బ్లాక్ మెయిల్
ఉదయ్‌పుర్: డబ్బు కోసం సంపన్న కుటుంబాలకు చెందిన వారిని తన ఇంటికి ఆహ్వానించి మత్తు మందు ఇచ్చి, అనంతరం వారితో గడిపి సీడీలు తయారు చేసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్న ఓ మహిళను రాజస్ధాన్ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆమె పేరు రుబినా హరున్ ఖాన్. వయసు 28 సంవత్సరాలు. రాజస్దాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన వర్మ కాలనీలోని గోవర్దన విలాస్ అపార్ట్‌మెంట్ ఏరియాలో నివాసం ఉంటుంది. ఉదయ్‌పుర్‌లో ఓ ప్రముఖ ఆటో మొబైల్ సంస్ధలో పనిచేస్తోంది. వాహనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిలో బాగా డబ్బున్న కుటుంబాలకు చెందిన వారిని ఎంచుకుంటుంది.
వారిని తనంతట తానే ఫోన్లు చేసి ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత డ్రగ్స్ ఇచ్చి వారితో గడిపి అశ్లీల సీడీలను తయారు చేస్తుంది. వాటిని చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గంజుతుంది. ఇలా ఉదయ్‌పుర్ సమీపంలో గల చాలా మందితో సన్నిహితంగా మెలుగుతూ కోట్లకుపైగా డబ్బులు గుంజింది.

ఆమె స్నేహితుడు రఫీక్ మహమ్మద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రుబినా హరున్ ఖాన్ సంపన్నుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరోజు తాను రుబినా ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లానని, డ్రగ్స్ కలిపిన బీర్ ఆఫర్ చేస్తే, తెలియకుండా దాన్ని తాగిన నేను అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాయని, తిరిగి లేచి చూస్తే, తన ఇంట్లోనే ఉన్నానని, 'రాత్రి మిమ్మల్ని కారు డ్రైవర్ తీసుకువచ్చాడు' అని తన భార్య చెప్పిందని రఫీక్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకు 'నన్ను లైంగికంగా వేధించావు. రూ. 30 లక్షలు ఇవ్వకుంటే పోలీసు కేసు పెడతా' అంటూ రుబినా నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపాడు. సమాజంలో పద్ధతిగా బ్రతుకున్న నేను పరువు పోకూడదనే ఉద్దేశ్యంతో ఆమెతో బేరం కుదుర్చుకుని రూ. 2.5 లక్షలు ముట్టజెప్పానని తెలిపాడు.
అయినా సరే, సీడీలు ఇవ్వకుండా మళ్లీ బెదిరింపులకు పాల్పడుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రఫీక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రుబినాని అరెస్టు చేసారు. ఆమె వద్ద నుంచి పదలు సంఖ్యలో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications