భర్తను చంపి బాత్రూంలో పాతిపెట్టింది: జీవిత ఖైదు

మీరట్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి బాత్రూంలోనే పాతి పెట్టిన వివాహితకు కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ. 25వేల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని గంగానగర్‌కు చెందిన రాజేంద్ర పటేల్, వర్ష(నిందితురాలు) ఇద్దరు భార్య భర్తలు. రాజేంద్ర పటేల్ ఆర్మీ జవానుగా పనిచేస్తుండగా, ఆమె గృహిణి. 2012 మార్చి 24న రాజేంద్ర పటేల్‌కు వర్ష నిద్ర మాత్రలు ఇచ్చింది, అతడు నిద్రలోకి జారుకున్న అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేసింది.

Woman gets life term for killing, burying husband in bathroom

ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బాత్ రూంలోనే పాతిపెట్టింది. పైన బండలు వేసి ప్లాస్టరింగ్ కూడా చేయించింది. ఆ తర్వాత ఇల్లును మంజు అనే మరో మహిళకు అమ్మేసింది. దీంతో వారు మార్చి 27న గృహ ప్రవేశం చేశారు.

కాగా, బాత్రూం నిర్మాణంపై అనుమానం వచ్చి, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు తెలిసింది. అక్కడ తవ్వకాలు జరపడంతో రాజేంద్ర కుమార్ మృతదేహం బయటపడింది. దీంతో అదే రోజు వర్షను పోలీసులు అరెస్టు చేశారు. కేసును విచారించిన జిల్లా కోర్టు మంగళవారం ఆమెకు జీవిత ఖైదు విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+