భర్త కళ్లెదుటే.. భార్యను కిందపడేసి!, బార్‌లో ఊహించని ఘటనతో దంపతులు షాక్!

ఆమెను అసభ్యంగా తాకడంతో పాటు వెకిలిగా ప్రవర్తించారు. కిందపడేసి లైంగిక దాడి చేసేందుకు యత్నించారు.

కోల్‌‌కతా: భర్తతో కలిసి బార్ కు వెళ్లిన ఓ ఇల్లాలికి చేదు అనుభవం ఎదురైంది. పీకలదాకా తాగిన కొంతమంది వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కింద పడేసి ఆమెపై దాడి చేయడానికి యత్నించారు. పైగా తమ పలుకుబడి గురించి చెబుతూ 'జాగ్రత్త' అంటూ హెచ్చరించి పోయారు. చివరకు బౌన్సర్లు జోక్యం చేసుకుంటే గానీ వారి నుంచి ఆ మహిళకు విముక్తి కలగలేదు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో దంపతులు కేసు ఫైల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దంపతుల కథనం ప్రకారం.. తమ స్నేహితులైన మరో జంటతో కలిసి పార్క్ స్ట్రీట్ లోని ఓ నైట్ క్లబ్ కు వీరు వెళ్లారు. అయితే వీరు రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గరికి వచ్చి.. ఇక్కడికెందుకు వచ్చారు? అని కొంతమంది వ్యక్తులు దంపతులతో గొడవకు దిగారు.

woman molested in front of husband in posh park street bar

ఆ క్రమంలో ఆమెను అసభ్యంగా తాకడంతో పాటు వెకిలిగా ప్రవర్తించారు. కిందపడేసి లైంగిక దాడి చేసేందుకు యత్నించారు. దాడి చేసిన వ్యక్తుల్లో ఓ వ్యక్తి కోల్ కతాలోని ఓ సంపన్న వ్యాపారవేత్త కొడుకు అని దంపతులు చెబుతున్నారు. ఈ దాడి వెనుక అతనే సూత్రధారి అని ఆరోపిస్తున్నారు. చాలామంది బడాబాబులతో పరిచయాలు ఉన్నాయంటూ తమపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డారని దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తాను ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్నానని దంపతులు వాపోయారు. మహిళలకు నగరంలో రక్షణ లేకుండా పోతుందని ఆవేదన చెందారు. ఇదంతా కేవలం డబ్బుందన్న అహం తప్ప ఇంకొకటి కాదని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+