ఇది కుటుంబమా? లేక కామాంధుల క్యాంపా?

Gujarat: గుజరాత్‌లోని వడోదరలో ఒక 40 ఏళ్ల మహిళ తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ కేసులో ఆమె తన మామ, ఆడపడుచు భర్త(వరసకు అన్న) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తకు తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండటం వల్ల సహజ పద్ధతిలో గర్భం ధరించడం సాధ్యం కాదని తేలడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైద్య చికిత్సల నుంచి గర్భస్రావం వరకు..
బాధితురాలు ఫిబ్రవరి 2024లో వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చింది. అంటే వారిద్దరు 40 ఏళ్ల వయస్సులో పెద్దల సమక్షంలో లేట్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన కొన్ని వారాలకే ఆమె అత్తమామలు ఆమె వయసు కారణంగా గర్భం ధరించడం కష్టమని చెప్పారు. వైద్య పరీక్షల్లో భర్తకు వీర్యకణాలు(స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉన్నాయని తేలింది. వైద్యుల సలహా మేరకు ఆమెకు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్స చేయించారు. కానీ అది విఫలమైంది. అనంతరం ఆమె మరింత చికిత్స చేసుకోవడానికి నిరాకరించి ఒక బిడ్డను దత్తత తీసుకుందామని సూచించారు. అయితే అత్తమామలు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు.

Woman Raped by Father-in-law and Relative for Conception FIR Filed in Gujarat

అత్యాచారం.. భర్త బ్లాక్‌మెయిల్
పెళ్లైన ఆరు నెలల నుంచే ఆమెపై దారుణాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలు జులై 2024 నుంచి ఆరంభమయ్యాయి. ఓ రోజు ఆమె తన గదిలో నిద్రిస్తున్నప్పుడు, ఆమె మామ గదిలోకి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరిచి సహాయం అర్థించినప్పటికీ.. మామ ఆమెను కొట్టి బెదిరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. తనతో పడక సుఖం పంచుకోవడం వల్ల పిల్లలు పుడతారని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో జరిగిన ఘోరాన్ని భర్తకు చెప్తే.. అతను తనకొక బిడ్డ కావాలని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆమె ఈ విషయం గురించి బయట చెబితే, ఆమె నగ్న చిత్రాలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ తర్వాత మామ ఆమెపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ ఆమె గర్భం ధరించలేదు.

ఆమె గర్భం దాల్చకపోవడంతో ఆమె ఆడపడుచు భర్తను రంగంలోకి దింపారు. వరుసకు అన్నయ్య అయ్యే అతడు కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్ 2025లో ఆమె గర్భం ధరించింది. కానీ జులైలో గర్భస్రావం జరిగింది. ఈ గర్భస్రావం తర్వాత ఆమెకు మరింత ధైర్యం వచ్చి, జులై చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె వాంగ్మూలం ఆధారంగా ప్రాథమిక విచారణ చేసి ఆదివారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితురాలి గోప్యతను కాపాడటానికి ఆమె గుర్తింపు వెల్లడించబడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+