ఇదేం శాడిజం: డ్యాన్స్ వేయడం ఆపేసిందని తుపాకీతో కాల్చిన వ్యక్తి

లక్నో: ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ వేస్తూ మధ్యలో ఆపివేసిందన్న కారణంతో మహిళపై తుపాకీతో కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. మొత్తం ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి యువతిని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడాడు. డ్యాన్స్ వేయడం ఆపివేస్తే బుల్లెట్లు దూసుకెళుతాయని బెదిరించాడు. కానీ చివరకు అదే జరిగింది.

పెళ్లి వేడుకలో వేదికపై డ్యాన్స్ చేస్తున్న యువతి ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసింది. అయితే డ్యాన్స్ ఆపేస్తే చంపేస్తానంటూ బెదిరించాడు సుధీర్ అనే వ్యక్తి. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి డ్యాన్స్ చేయడం ఆపేసింది... తుపాకీతో కాల్చేయ్ అని రెచ్చగొట్టడం వీడియోలో వినిపించింది. ఈ మాటలు మాట్లాడుతుండగానే యువతిపైకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే కుప్పకూలింది. రక్తపు మడుగులో పడిపోయింది. ఇది చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. అప్పటి వరకు ఆమెతో కలిసి డ్యాన్స్ వేస్తున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి షాక్‌ అయ్యాడు.

Woman shot on face when stopped dancing at a wedding in UP

డిసెంబర్ 1న జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామ పెద్ద అయిన సుధీర్ సింగ్ పటేల్ కుమార్తె వివాహంలో ఈ దారుణం జరిగింది.ఇక అదే వేదికపై ఉన్న పెళ్లి కొడుకు మేనమామలు, మితిలేష్, అఖిలేష్‌లకు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల కథనం ప్రకారం సుధీర్ సింగ్ బంధువుల్లో ఒకరు ఈ కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి అంకిత్ మిట్టల్ చెప్పారు. మరోవైపు కాన్పూర్‌లో గాయపడిన యువతి చికిత్స జరుగుతోందని అయితే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

2016లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పంజాబ్‌లోని భాటిండాలో కుల్విందర్ కౌర్ అనే యువతి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా కాల్పులు జరిగాయి. అప్పటికే గర్భవతి అయిన కుల్విందర్ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇలాంటి ఘటన ఢిల్లీలో కూడా జరిగింది. ఓ వ్యక్తి బార్‌లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా.. డీజేతో వాగ్వాదానికి దిగడంతో ఆయన హత్యకు గురయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+