వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వామ్మో.. తాజ్ మహల్ వద్ద బీడీ తాగుతున్న మహిళ, మందు బాటిల్ కూడా..

|
Google Oneindia TeluguNews

ఆగ్రా.. ఇక్కడే తాజ్ మహల్ కూడా ఉంది. ఇదీ ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందింది. చక్రవర్తి షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం కట్టించిన చారిత్రక కట్టడం.. అయితే ఇక్కడ సమీపంలో సిగరేట్/ ఆల్కహాల్ నిషిద్దం. అక్కడ అలాంటివీ ఏమీ దొరకవు. సిగరేట్ తాగడమో.. మందు తాగడమో చేస్తే ఇక అంతే సంగతులు. కానీ అక్కడ బీడీ తాగడం.. మద్యం సీస కనిపించింది. దీంతో దుమారం రేపింది. ఘటనపై సీఐఎస్ఎఫ్ విచారణ చేపట్టింది.

 బీడీ తాగుతున్న మహిళ..

బీడీ తాగుతున్న మహిళ..


ఇందాక మనం చెప్పుకుంది రియాల్టీ.. కానీ అందుకు విరుద్దంగా పరిస్థితి ఉంది. అవును తాజ్ మహల్‌కు కూతవేటు దూరంలో ఓ మహిళ స్మోక్ చేస్తోంది. ఆమె ఎంచక్కా బీడి తాగుతుంది. దీంతో భద్రతపై మరోసారి సందేహాం తలెత్తింది. దానిని కొందరు వీడియో తీసి షేర్ చేశారు. ఇంకేముంది అదీ తెగ వైరల్ అవుతుంది. ఇటు తాజ్ మహల్ సమీపంలో మద్యం సీసా కూడా కనిపించింది. ఓ డస్ట్ బీన్‌లో లిక్కర్ బాటిల్ కనిపించడంతో.. కలకలం రేగింది. బీడీ, మందు సీసా కనిపించడంతో తీవ్ర కలకలం రేపింది.

లిక్కర్ బాటిల్

లిక్కర్ బాటిల్


మహిళ బీడి తాగడంతో భద్రతపై ప్రశ్న తలెత్తింది. దీంతో భయాందోళన కలిగిస్తోంది. మహిళా బీడి తాగిన ఘటనపై.. సీఐఎస్ఎఫ్ దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ బాటిల్ లభించగా.. ఆ సీసీ టీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. కానీ రెండు ఘటనలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే పర్యాటక ప్రాంతం ఇలా కనిపించడం దుమారం రేగింది. ఇదేంటి ఇక్కడ ఇలా అని మిగతా జనం ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.

అసలే కాలుష్యం..

అసలే కాలుష్యం..


యుమునా నదీ తీరంలో తాజ్ మహల్ ఉంది. నదీ, కాలుష్యం వల్ల కట్టడం దెబ్బతింటుంది. దీనిపై భారత పరావస్తు శాఖ పలుమార్లు హెచ్చరించింది. అందుకోసం ఇప్పటికే పలు భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. గట్టి నిఘా, భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. ఇంత వ్యవస్థ ఉండగా.. అక్కడ మహిళ బీడీ తాగడం తీవ్ర కలకలం రేపింది.

English summary
woman smoking bidi in the Taj Mahal premises goes viral. creating havoc and panic amongst the security system
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X