ప్రేమ పేరుతో.. ఆమెకు శారీరకంగా దగ్గరై: గర్భం దాల్చాక మరో యువతితో!

Subscribe to Oneindia Telugu

నోయిడా: ప్రేమ పేరుతో యువతికి దగ్గరై.. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన ఓ వ్యక్తి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దపడ్డాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. నోయిడాలోని 62వ సెక్టార్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పాట్నాకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. స్నేహితులతో కలిసి ఉంటున్న ఆమె గత రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ప్రేమ వ్యవహారం వారిద్దరి మధ్య శారీరక కలయికకు కూడా దారి తీయడంతో.. ఆమె గర్భం దాల్చింది.

 woman techie commits suicide in noida

ఇంతలో అతను వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman software engineer allegedly committed suicide by hanging herself at her rented accommodation in Sector 62 here, the police said on Thursday.
Please Wait while comments are loading...