గుడికి బయలుదేరి, లిఫ్ట్ కింద శవమైయ్యింది
చెన్నయ్: గుడికి వెళ్లి వస్తానని ఇంటి నుండి వెళ్లిన మహిళ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ కింద శవమై కనిపించిన సంఘటన చెన్నయ్ నగరంలో జరిగింది. చెన్నయ్ లోని కొత్వాల్ చావడి సాధిక్ వీధిలో నివాసం ఉంటున్నరేణు కన్వర్ అలియాస్ రేణుక (42) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది.
దేవిసింగ్, రేణు కన్వర్ దంపతులు. దేవిసింగ్ షావుకారు పేటలో బోమ్మల హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. శనివారం అతను షో రూం దగ్గరకు వెళ్లాడు. తరువాత తాను గుడికి వెళ్లి వస్తానని రేణు కన్వర్ భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
తరువాత ఆమె ఆచూకి లేదు, భర్తతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు రేణు కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో కొత్వాల్ చావడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలించినా ఎలాంటి సమాచారం చిక్కలేదు.

వీరు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఉన్న ప్రాంతం నుండి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రెండు రోజుల నుండి లిఫ్ట్ పని చెయ్యడం లేదని అక్కడ నివాసం ఉంటున్న వారు పోలీసులకు చెప్పారు.
పోలీసులు టెక్నీషియన్స్ ను పిలిపించి లిఫ్ట్ రిపేర్ చేయించారు. లిఫ్ట్ అడుగు భాగంలో రేణు శరీరం సగం నలిగిపోయి శవమై కనిపించింది. రేణు లిఫ్ట్ అడుగు భాగంలోకి ఎలా వెళ్లింది. ఎవరైనా హత్య చేసి అక్కడ విసిరి వేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications