నా అందానికి ఆడాళ్లు పడిపోతారు: ఉబేర్ క్యాబ్ డ్రైవర్

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్ అత్యాచారం కేసులో నిందితుడైన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ మాటలకు దర్యాప్తు అధికారులు విస్తుపోతున్నట్లు తెలుస్తోంది. తనను తాను మహిళలు ఆకర్షించే అయస్కాంతంగా అతను భావిస్తున్నట్లు చెబుతున్నారు. శివకుమార్ యాదవ్ కార్యాలపై జాతీయ మీడియాలో శుక్రవారం పలు కథనాలు వచ్చాయి. హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం - తన అందానికి సహజంగానే మహిళలు పడిపోతారని దర్యాప్తు అధికారులకు అతను చెప్పాడు.

ఐదడుగుల ఆరు అంగుళాల ఎత్తు, 60 కిలోల బరువు గల 32 ఏళ్ల శివ కుమార్ యాదవ్ ఢిల్లీ పోలీసులకు తాను ప్రత్యేకమైనవాడిననే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెబుతున్నారు. సెక్స్ పట్ల గల అతనికి గల అబ్షెషన్‌కు, అబద్ధాలు ఆడడంలోనూ తప్పుదోవ పట్టించడంలోనూ అతని నేర్పునకు దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపడుతున్నట్లు తెలుస్తోంది.

అతన్ని సీరియల్ రేపిస్టు జాబితాలో చేరుస్తున్నట్లు పోలీసులు గురువారం కోర్టుకు తెలిపారు. అతను ఎల్లవేళలా సెక్స్ గురించి ఆలోచిస్తాడని పోలీసులు చెబుతున్నారు. తన క్యాబ్‌లో కూర్చునే మహిళల గురించి ఊహలు చేస్తుంటాడని, ఆ ఊహాలను మిత్రులకు కూడా పంచుతుండేవాడని అంటున్నారు.

Women naturally succumb to my charm: Uber cabbie to cops

అతని మొబైల్ ఫోన్‌ అశ్లీలతతో నిండిపోయిందని అంటున్నారు. యాదవ్ రాత్రి వేళ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, పబ్స్ వెలుపల యాదవ్ తన క్యాబ్ సర్వీసుతో నిరీక్షిస్తూ ఉండేవాడని, తన క్యాబ్‌లో వారిని ఎక్కించుకోవడానికి తంటాలు పడేవాడని అంటున్నారు. గుర్గావ్‌లో ఎంజి రోడ్డు అతనికి ప్రియమైన ప్రదేశమని చెబుతున్నారు. మహిళలను తన క్యాబ్‌లో ఎక్కించుకుని సెక్స్ కోరిక కోరేవాడని అంటున్నారు.

14 ఏళ్ల వయస్సులో మొదటి సారి..

శివ కుమార్ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత ప్రాంతం మైన్‌పురిలో తొలిసారి సెక్స్ అనుభవాన్ని రుచిచూశానని చెప్పినట్లు సమాచారం. అతనికి రెండు డ్రైవింగ్ లెసెన్సులున్నాయని చెబుతున్నారు. వాటిలో ఒక్కటి నకిలీది కావచ్చునని అనుమానిస్తున్నారు. ఉబేర్ ఇచ్చిన ఫోన్ ఒక్కటే తన వద్ద ఉందని శివకుమార్ యాదవ్ చెప్పాడు. కానీ మరో రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టెమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇందుకు సంబంధించిన ఓ వార్తాకథనం ప్రచురితమైంది. యాదవ్ తన క్యాబ్‌లో మహిళలను ఎక్కించుకుని, నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసేవాడని చెబుతున్నారు. ఓ నేరం చేసిన తర్వాత కొన్నాళ్లు ఏమీ ఎరగనట్లు ఉండేవాడని, కొంత కాలం అటువంటివాటికి దూరంగా ఉండేవాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+