అడవిలో డిప్యూటీ సీఎం భార్య ఫొటో షూట్- వేరే శతృవులు అక్కర్లేదు

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్- సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఫేస్ బుక్, ఇస్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై సెలెబ్రిటీ స్టేటస్‌లో ఉన్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను లక్షల మంది ఫాలో అవుతున్నారు. అదే స్థాయిలో లైక్స్, షేర్స్ రికార్డవుతుంటాయి. ఇదివరకు కూడా ఆమె పలు వీడియోలు చేశారు.

గతంలో ఆమె రూపొందించిన ఓ డాన్స్ వీడియో.. తీవ్ర వివాదాస్పదమైంది. ఓ ముస్లిం టీనేజ్ కుర్రాడితో ఆడిపాడటానికి సంబంధించిన వీడియో అది. ఆ యువకుడి పేరు రియాజ్ అలీ. టాప్ టిక్ టాకర్. అతనితో కలిసి ఆజ్ మై మూడ్ బనాలయా రే అనే పంజాబీ పాటకు డాన్స్ చేశారు అమృత ఫడ్నవీస్. ప్రభుత్వం కేటాయించిన బంగళాలో కూడా ఈ వీడియోను షూట్ చేశారు.

 World Environment Day: Amruta Fadnavis photos goes viral

ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో.. ఓ ముస్లిం కుర్రాడితో కలిసి స్టెప్స్ వేశారామె. ఈ వీడియోను రియాజ్ అలీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ తెచ్చిపెట్టింది. దీనిపై అప్పట్లో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ పై విమర్శల దాడికి దిగారు.

అటు నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఘాటుగా స్పందిస్తోన్నారు. బయట లవ్ జిహాద్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న బీజేపీ నాయకుల పెద్దలు మాత్రం- ఇలా ముస్లిం కుర్రాడితో డాన్స్ చేయవచ్చా? అంటూ నిలదీశారు. ఈ వ్యవహారం దేవేంద్ర ఫడ్నవిస్ అప్పట్లో ఇరకాటంలోకి నెట్టింది. ఈ వీడియోపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు తాజాగా అడవిలో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు అమృత ఫడ్నవిస్. ఇవ్వాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని స్పెషల్ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేశారు. ముదురు గులాబీ రంగు వెస్ట్రన్ ట్రాక్ సూట్‌లో కనిపించారమె. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ జత చేశారు.

మానవ నిర్మిత ప్రపంచంలో కొందరు దారి తప్పారని, మరికొందరు పర్యావరణంలో తమను తాము వెదుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారని కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ప్రేమించాలని, అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అంటూ అమృత ఫడ్నవిస్ సూచించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి కొందరు ఆమె ట్రోల్ చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+