Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

khiladi wife: దుబాయ్ మొగుడు, ఎస్ఐ ప్రియుడితో భార్య దున్నేసింది, ఏరియాలోనే హాట్ టాపిక్, దెబ్బకు !

చెన్నై/ దుబాయ్: దుబాయ్ లో ఉద్యోగం చెయ్యడానికి భర్త వెళ్లిన సమయంతో అతని భార్య ఎస్ఐతో అక్రమ సంబంధం సాగించింది. దుబాయ్ లో మొగుడు ఉండటంతో ప్రియుడితో కలిసి భార్య ఇక్కడ దున్నేసింది. భర్తతో పోరాటం చేస్తూ తాను న్యాయం కావాలని కోర్టు చుట్టూ తిరుగుతున్న సమయంలో తనను వేధింపులకు గురి చేసిన సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)ని ప్రశ్నించగా తన మీద దాడి చేశాడని భర్త పోలీసు కేసు పెట్టాడు. తన భార్యతో ఎస్ఐ అక్రమ సంబంధం సాగించి తన రూ. కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని భర్త పోలీసు అధికారులను ఆశ్రయించాడు. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని సదరు ఎస్ఐ కూడా భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో రచ్చరచ్చ అయ్యింది.

 దుబాయ్ లో భర్త.... చెన్నైలో భార్య

దుబాయ్ లో భర్త.... చెన్నైలో భార్య

చెన్నైలోని కేకే నగర్ భారతీ దాసన్ కాలనీకి చెందిన జనార్దన్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. జనార్దన్ కు చెన్నైలో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. జనార్దన్ కు భార్య నర్మదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న జనార్దన్ ఎక్కువగా చెన్నైలో ఉండలేకపోతున్నాడు. నర్మదా తన ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటోంది.

 భార్య బిజీ.... ఫోన్ ఇంకా బిజీ

భార్య బిజీ.... ఫోన్ ఇంకా బిజీ

దుబాయ్ లో ఉంటున్న జనార్దన్ భార్య నర్మదా, తన ఇద్దరు పిల్లలతో ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నించిన సమయంలో ఆమె ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్ వస్తోందని, బిజీబిజీ అనివస్తోందని తెలిసింది. ఇదే విషయంలో జనార్దన్ చాలా సార్లు విసిగిపోయాడని సమాచారం. తనతో కాకుండా తన భార్య నర్మదా ఎవరితో మాట్లాడుతోంది ? అనే అనుమానం జనార్దన్ లో మొదలైయ్యింది.

 ఎస్ఐతో భార్యకు లింక్

ఎస్ఐతో భార్యకు లింక్

భర్త జనార్దన్ దుబాయ్ నుంచి చెన్నై వచ్చాడు. ఆ సమయంలో భార్య నర్మదా ప్రవర్తనపై జనార్దన్ కు అనుమానం కలిగింది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతున్న నర్మదాను భర్త జనార్దన్ నిలదీశాడు. అదే సమయంలో చెన్నైలోని తిరునిండ్రవూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ తో నర్మదాకు అక్రమ సంబంధం ఉందనే విషయం బయటపడింది. తాను దుబాయ్ లో ఉంటే చెన్నైలో తన భార్య నర్మదా ఆమె ఎస్ఐ ప్రియుడు రాజేష్ తో కలిసి ఎంజాయ్ చేస్తోందని భర్త జనార్దన్ కు తెలిసిపోయింది.

 ఏరియాలో ఎస్ఐ, నర్మదా లవ్ స్టోరీ హాట్ టాఫిక్

ఏరియాలో ఎస్ఐ, నర్మదా లవ్ స్టోరీ హాట్ టాఫిక్

నర్మదా, సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ ల అక్రమ సంబంధం గురించి తిరునిండ్రవూర్ ప్రాంతం మొత్తం తెలిసిందని, అయినా వారు మాత్రం పట్టించుకోవడం లేదని జనార్దన్ కు అతని స్నేహితులు చెప్పారు. ఈ విషయంపై కలత చెందిన జనార్దన్ భార్య నర్మదాపై మండిపడ్డాడు. పద్దతి మార్చుకోకపోతే ఫలితం వేరుంగా ఉంటుందని భార్య నర్మదాను భర్త జనార్దన్ హెచ్చరించాడు. అయినా నర్మదా మాత్రం పట్టించుకోలేదు.

 మొగుడి డబ్బుతో ప్రియుడితో భార్య జల్సా

మొగుడి డబ్బుతో ప్రియుడితో భార్య జల్సా

నర్మదా తీరు మారకపోవడంతో జనార్దన్ తనకు భార్యతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడ సంపాధించిన డబ్బులు తన భార్య నర్యదాకు పంపిస్తున్నానని, అంతే కాకుండా చెన్నైలోని తన వ్యాపార సంస్థల్లో వస్తున్న లాభాలను సైతం ఆమె తీసుకుంటున్నదని, ఆ డబ్బుతో ఎస్ఐ రాజేష్ కుమార్ తో జల్సాలు చేస్తోందని జనార్దన్ కోర్టులో చెప్పాడు. తన భర్త జనార్దన్ మద్యంకు, జూదానికి బానిస అయ్యాడని, రూ. కోట్ల రూపాయలు ఆస్తిని ఇలాగే తగలేశాడని నర్మదా ఆరోపిస్తున్నది. రూ. కోట్ల రూపాయలు అప్పులు పెరిగిపోవడంతో తన కుటుంబ సభ్యులు మమ్మల్ని కాపాడి ఆస్తులు విడిపించారని నర్మదా కోర్టులో చెప్పారు.

 భర్త, భార్య, ఎస్ఐ కేసుల మీద కేసులు

భర్త, భార్య, ఎస్ఐ కేసుల మీద కేసులు

తన మీద తన భార్య నర్మదా ప్రియుడు ఎస్ఐ రాజేష్ కుమార్ దాడి చేశాడని, తనకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యాలని జనార్దన్ రాయలా నగర్ పోలీసులకు, చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. తన మీద జనార్దన్ దురుసుగా ప్రవర్తించాడని ఎస్ఐ రాజేష్ కుమార్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పబ్లిక్ స్థలంలో జనార్దన్ మీద ఎస్ఐ రాజేష్ కుమార్ దాడి చేశాడని, ఫోటోలు తీసిన వ్యవహారంలో జనార్దన్ మీద కేసు నమోదు చెయ్యడం అప్పట్లో కలకలం రేపింది. జనార్దన్, నర్మదా, ఎస్ఐ ల వ్యవహారం 2020లో చెన్నైలో రచ్చరచ్చ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+