బెంగళూరులో మరో షాకింగ్: ఉదయాన్నే అసభ్యంగా.. అలా పారిపోయాడు
కర్నాటక రాజధాని బెంగళూరులో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సామూహికంగా, ఒంటరిగా మహిళలను వేధించిన ఘటన మరవకముందే ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు కూడా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సామూహికంగా, ఒంటరిగా మహిళలను వేధించిన ఘటన మరవకముందే ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు కూడా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.
డిసెంబర్ 31 అర్థరాత్రి తరహాలో ఓ యువతి వేధింపులకు గురయింది. ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నగర్వారా మెయిన్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. విధులకు వెళ్తున్న మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

పెనుగులాటలో ఆమె నాలుక తెగడంతో పాటు స్వల్ప గాయాలయ్యాయి. కుక్క మొరగడంతో అతను పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications