యూపీలో మతఘర్షణలు, అరాచకానికి అలా కళ్లెం వేశా- ఓటర్లతో యోగీ ఆదిత్యనాథ్...
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలిదశ స్ధానిక సంస్ధల పోరు పూర్తి కాగా.. ఎల్లుండి రెండో దశ జరగనుంది. దీంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్వయంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో తన పాలనతో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్లు, హత్యలను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అరాచకాలకు తాను ఎలా ఫుల్ స్టాప్ పెట్టారో వివరిస్తున్నారు.
ఆగ్రాలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అలవాటు చేసిన మత ఘర్షణలు, అరాచకాలకు తాను అలీఘర్ లాక్ తో ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలిపారు. 2017కు ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కులం, బంధుప్రీతిని వాడుకుని రాజకీయాలు చేశాయని యోగీ ఆరోపించారు. ఈ కుల, బంధుప్రీతి పార్టీలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు.

బుజ్జగింపు రాజకీయాలతో గతంలో పార్టీలు అధికారంలోకి వచ్చాయని, వారు సమాజాన్ని చీల్చి రాజకీయంగా లబ్ది పొందారని యోగీ విమర్శించారు. తద్వారా సమాజంలో వర్గాల మధ్య అగాధం పెంచాయన్నారు. వీటి కారణంగా పండుగల సమయంలో సైతం ప్రజలు భయాందోళనలతో ఉండేవారన్నారు. గతంలో అలీఘర్ లో చోటు చేసుకున్న రాజకీయాల్ని దాటి ఇప్పుడు స్మార్ట్ సిటీ అవుతోందన్నారు.
రాష్ట్రంలో పిస్టోల్ సంస్కృతిని కూడా రూపుమాపామని, ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యార్ధుల చేతుల్లో ట్యాబ్ లు కనిపిస్తున్నాయని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓటర్లకు గుర్తుచేశారు. గతంలో మాఫియా బెదిరింపులతో భయంతో వణికిపోయిన వ్యాపారులు ఇప్పుడు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారని యోగీ తెలిపారు. అలీఘర్ లో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందుకోసం రూ.700 కోట్లు కూడా కేటాయించామన్నారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications