Xలో దూసుకుపోతున్న యోగీ ఆదిత్యనాథ్-ప్రధాని మోడీ తర్వాత రికార్డు..!
సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)లో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది ఫాలోయర్లు కలిగిన యోగీ ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఆ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. యోగీకి యూపీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆదరణ ఏ స్ధాయిలో ఉందంటే మన దేశంలో ప్రధాని మోడీ తర్వాత అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా ఆయన నిలుస్తున్నారు.
గత నెల రోజుల కాలంలో ట్విట్టర్ లో యోగీ ఆదిత్యనాథ్ ఫాలోయర్ల సంఖ్య అక్షరాలా 2.67 లక్షలు పెరిగింది. భారత దేశంలోని రాజకీయ నేతల్లో ఆయన కంటే ముందు కేవలం ప్రధాని మోడీ మాత్రమే ఉన్నారు. ఈ 30 రోజుల కాలంలో ప్రధాని మోడీకి 6.32 లక్షల ఫాలోయర్లు పెరిగారు. దీంతో మోడీ తర్వాత స్ధానంలో యోగీ నిలిచారు. మిగతా రంగాల వారిని మినహాయిస్తే ప్రధాని మోడీతో పోటాపోటీగా ఫాలోయర్లను పెంచుకుంటూ యోగీ ఆదిత్యనాథ్ ఎక్స్ లో సత్తా చాటుతున్నారు.

ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెట్టే యోగీ ఆదిత్యనాథ్ కు ముందు నుంచీ ఫాలోయర్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో భారత్ రాహుల్ గాంధీ సహా ఎందరో భారతీయ రాజకీయ నేతల కంటే యోగీ ట్విట్టర్ లో ఎంతో ముందుంటున్నారు. అలాగే యోగీకి ఆదరణ కూడా వేగంగా పెరుగుతోందని కూడా యూపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం యోగీ ఆదిత్యనాథ్ కు ఎక్స్ లో ఫాలోయర్లు 26 మిలియన్లు అంటే 2.6 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.
అలాగే అన్ని రంగాలను కలుపుకుని భారతీయుల జాబితా తీస్తే అందులోనూ యోగీ చాలా ముందున్నారు. ఈ జాబితాలో యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో, ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే ఉన్నారు. వీరి తర్వాత యోగీ ఆదిత్యనాథ్ నాలుగో స్ధానంలో ఉన్నారు. అసలే వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని మోడీకి పోటీదారుగా మారతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణ బీజేపీ అగ్రనేతలకు కూడా షాకులిస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications