నిజంగా మీరేనా?: సుష్మాకు ట్విట్టర్‌లో ప్రశ్న, నెటిజన్ల ప్రశంసలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కేంద్రం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తుండటం, వాటికి ఆమె ఎంతో ఓపికగా సమాధానం చెబుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
రాజకీయాలే కాకుండా తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన విషయాలకు కూడా ఆమె తన ట్విట్టర్ ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. ఇటీవలే ఓ వ్యక్తి తన భార్య లేకుండా హానీమూన్‌కు వెళ్తోన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
దీనిపై వెంటనే స్పందించిన సుష్మా అతడితో పాటు భార్యను హానీమూన్ పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన సంగతి మనం చూశాం. తాజాగా, సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్ ఖాతాదారుడు ఒకరు
'సుష్మా స్వరాజ్.. నిజంగా మీరేనా? భారత రాజకీయ నాయకుల లక్షణాలు మీలో లేవు. ఎందుకంటే, మీరు, మా గురించి, అదే, భారతీయుల గురించి ఆలోచిస్తున్నారు!' అంటూ సదరు వ్యక్తి ఆమెను పొగుడుతూనే ప్రశ్నించాడు.
@SushmaSwaraj are you real? Just checking. You don't meet requirement of being Indian politician. You are concerned about us(Indians).
— Sumant balgi (@sumantbalgi) August 23, 2016
ఈ ట్వీట్‌కు సుష్మా మాత్రం చాలా హుందాగా, గౌరవప్రదంగా స్పందించింది. 'దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు, భారత రాజకీయ నేతలు చాలా సున్నిత మనస్కులు. సాయపడాలనే తత్వం బాగా ఉన్నవారు' అంటూ ఆమె పేర్కొన్నారు.
Please do not have such notions. Indian politicians are sensitive and very helpful. https://t.co/9U0Rdxvn8q
— Sushma Swaraj (@SushmaSwaraj) August 23, 2016
సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ ఒక్క ట్వీట్ రికార్డుని సృష్టించింది. సుష్వా ట్వీట్ చేసిన 13 గంటల్లో ఈ ట్వీట్‌ను 1000 మందికి పైగా లైక్ చేయగా, 350 మంది రీట్వీట్ చేశారు.
@SushmaSwaraj @sumantbalgi really the concern shown by you & your team is more than our expectations, thank you so much!
— Manjunath Bhat (@BhatMaestro) August 23, 2016
@SushmaSwaraj don't know about all other politicians but you certainly are most helpful hatsoff to you mam @sumantbalgi
— anil hekale (@anilhekale) August 23, 2016
@sumantbalgi For once I disagree with @SushmaSwaraj .She has redefined the role of a minister or rather the only one doing her duty well
— psrindian (@psr1026) August 23, 2016
@SushmaSwaraj we wish all politicians in India become sensitive like U and help people in distress and make them feel proud of their nation
— Raman Chopra (@shiriram15) August 23, 2016
@SushmaSwaraj You suprise me... you define a true hard working Indian woman to me... #Respect
— Chaitali (@chats53) August 23, 2016