అక్కతో అక్రమ సంబంధం, బావ కళ్లలో ఆనందం కోసం అక్క ప్రియుడిని !
చెన్నై/చెంగల్పట్టు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ప్రేమికులు శారీరక సంబంధం పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వివాహం జరిగి, పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నిత్యం ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. విషయం తెలుసుకున్న మహిళ తమ్ముడు అతని అక్క ప్రియుడికి కరెక్ట్ గా స్పాట్ పెట్టాడు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని చిన్న ఇరుంపేడు గ్రామానికి చెందిన తిరునావుక్కరసు (28) అనే యువకుడు శ్రీపెరంబుదూర్ సమీపంలోని ఒరగడమ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లిన తిరునావుక్కరసు రాత్రి ఇంటికి తిరిగి వెలుతున్న సమయంలో అతన్ని నరికి చంపేశారు.

వీఆర్ఓ కార్యాలయం సమీపంలో తిరునావుక్కరసు మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తిరుక్కలుక్కున్రం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరునావుక్కరసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జిల్లా ఆస్పత్రికి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
హత్యకు గురైన తిరునావుక్కరసుకు, తిరుక్కలుక్కుందర టీచర్స్ నగర్ ప్రాంతానికి చెందిన కన్నియమ్మాళ్ అనే వివాహితకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తిరునావుకరసు, కన్నియమ్మాళ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో కన్నియమ్మాల్ కు ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు.

ఇటీవల కన్నియమ్మాల్ ఆమె పుట్టింటికి వెళ్లింది. మా ఇంట్లో ఎవ్వరూ లేరని, నువ్వు మా ఇంటికి రావాలని కన్నియమ్మాల్ ఆమె ప్రియుడు తిరునావుక్కరసుకు ఫోన్ చేసి చెప్పింది. తిరునావుక్కరసు ప్రియురాలు కన్నియమ్మాల్ ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో ప్రియురాలితో మస్త్ మజా చేస్తున్నాడు. అదే సమయంలో కనియమ్మాళ్ తమ్ముడు మణికందన్ ( 22) ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో ఏకాంతంగా ప్రియుడితో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న అక్కను చూశాడు.
ఆ సమయంలో గొడవ చేస్తే ఇద్దరూ అలర్ట్ అయిపోతారని అనుకున్న మణికందన్ ఇంటికి కొద్ది దూరంలోకి వెళ్లాడు. రెండు గంటల తరువాత రొమాన్స్ పూర్తి చేసుకున్న తిరునావుక్కరసు కన్నియమ్మాల్ ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే రోడ్డులో పార్క్ చేసిన అతని బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత కూడా కన్నియమ్మాల్ ఆమె ప్రియుడు తిరునావుక్కరసును నేరుగా ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. తరువాత మణికందన్ ఇద్దరిని బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారికి వార్నింగ్ ఇచ్చాడు.
మణికందన్ హెచ్చరించినా ఇద్దరూ తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. తిరునావుక్కరసు తరచుగా కనియమ్మాళ్ ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న ఆమె తమ్ముడు మణికందన్ అక్క ప్రియుడు తిరునావుక్కరసును చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అక్క ప్రియుడు తిరునావుక్కరసును హత్య చెయ్యడానికి మణికందన్ అతని స్నేహితుల సహాయం కోరాడు.
ఎప్పటిలాగే తిరునావుక్కరసు ఉదయం బైక్ పార్క్ చేసి బస్సులో ఉద్యోగానికి వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని బస్సులో బైక్ పార్క్ చేసిన ప్రాంతానికి తిరిగొచ్చాడు. బైక్ తీసుకున్న తిరునావుక్కరసు ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో మణికందన్, అతని స్నేహితుడు కుమార్ ఇద్దరూ పక్కాప్లాన్ ప్రకారం తిరునావుక్కరసును ఎవరూ లేని ప్రాంతంలో అడ్డగించి అతని మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. తిరునావుక్కరసును నరికి చంపేసి తరువాత అతని శవాన్ని గ్రామం సమీపంలోని వీఆర్ఓ ఆఫీసు పక్కన విసిరేసి పరారైనారు.

పోలీసులు మణికందన్ ను పట్టుకున్నారు. తిరునావుక్కరసును తామే హత్య చేశామని మణికందన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీని ఆధారంగా తిరుక్కల్లుక్కున్రం పోలీసులు మణికందన్‌తో పాటు అతని స్నేహితుడు కుమార్‌ను అరెస్టు చేసి తిరుక్కల్లుక్కున్రం క్రిమినల్ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
ఒరగడంలో పనిచేసే తిరునావుక్కరసుకు రోజూ తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై పిడుగురాళ్లకు రావడం అలవాటు. తాండరాయి వద్ద బైక్‌ను వదిలి కంపెనీ బస్సులో పనికి వెలుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మణికందన్ తన స్నేహితుడు కుమార్‌తో కలిసి తిరునావుక్కరసును చంపేయాలని స్కెచ్ వేశాడని, రాత్రి తాండరై వద్ద వేచి చూసి అక్క ప్రియుడు తిరునావుక్కరసును చంపేశారని పోలీసులు చెప్పారు. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న తిరునావుక్కరసు హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications