బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Brother: భార్య కోసం అన్నను చంపిన తమ్ముడు, గుండెపోటుతో తండ్రి ?, ఫ్యామిలీ రక్త చరిత్రతో, ఒకే చోట !

|
Google Oneindia TeluguNews

చెన్నై/హోసూరు: మహాభారతం కాలం నుంచి నేటి వరకు దాయాదుల పోరు ఎలాఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. చాలా మంది దాయాదులు సొంతతల్లి బిడ్డాల్లా జీవిస్తున్నారు. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు శత్రువులగా మారిపోతున్నారు. అయితే పెద్దనాన్న కొడుకు తన భార్యను దూషించి అసభ్యంగా ప్రవర్తించాడని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. అప్పటికే లిక్కర్ పార్టీలో ఉన్న భర్త ప్రెండ్స్ ను వెంటవేసుకుని వెళ్లి అన్నను అడ్డంగా నరికేశారు. తన అన్న కొడుకు నా కొడుకును హత్య చేశాడని ఆవేదనతో తండ్రి ప్రాణాలు వదిలేశాడు. ఇంత జరగడానికి కారణం అయిన మహిళ మాత్రం సైలెంట్ గా నంగనాచిలా ఉండిపోయింది.

too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?

ఒకే వీధిలో దాయాదుల ఫ్యామిలీలు

ఒకే వీధిలో దాయాదుల ఫ్యామిలీలు

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరులోని పాయకేపల్లి (బెంగళూరు సరిహద్దు)లోని అన్నయ్యప్ప (70) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. అన్నయ్యప్పకు శేఖర్ అలియాస్ చెన్నప్ప (35) అనే కుమారుడు ఉన్నాడు. అన్నయ్యప్ప సొంత తమ్ముడి కుమారుడు విజయ్. విజయ్ కు మధుమతి అలియాస్ మధు అనే యువతితో వివాహం అయ్యింది. అన్నయ్యప్ప కుటుంబ సభ్యులు, అతని తమ్ముడు కుమారుడు విజయ్ కుటుంబ సభ్యులు అందరూ ఒకే వీధిలో వరుసగా ఉంటున్న ఇళ్లల్లో వేర్వేరుగా కాపురాలు ఉంటున్నారు.

 భర్తకు ఫోన్ చేసి భార్య ఏం చెప్పిందంటే

భర్తకు ఫోన్ చేసి భార్య ఏం చెప్పిందంటే

రాత్రి విజయ్ అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి వెళ్లాడు. తరువాత విజయ్ కి అతని భార్య మధు ఫోన్ చేసింది, మీ అన్న శేఖర్ తనను తిట్టాడని, అసభ్యం మాట్లాడుతున్నాడని, నువ్వు వెంటనే ఇంటికి రావాలని ఫోన్ చేసి చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విజయ్ అతని స్నేహితులను వెంటపెట్టుకుని అతను నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లాడు.

పెద్దనాన్న కొడుకును కత్తులతో పొడిచి

పెద్దనాన్న కొడుకును కత్తులతో పొడిచి

ఇంటి దగ్గరకు వెళ్లిన విజయ్ మొదట బద్దిమంతుడిలా అతని భార్య మధును మందలించి ఇంటి లోపలికి వెళ్లాలనని చెప్పాడు. తరువాత ఇంటి పక్కనే నివాసం ఉంటున్న పెద్దనాన్న కుమారుడు శేఖర్ ను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అన్న అనికూడా చూడకుండా విజయ్ అతని పెద్దనాన్నకుమారుడు శేఖర్ ను బూతులుతిట్టాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన విజయ్, అతని స్నేహితులు కలిసి శేఖర్ ను కత్తులతో పొడిచేశారు.

కళ్లముందే కొడుకు హత్య.... తండ్రికి గుండెపోటు

కళ్లముందే కొడుకు హత్య.... తండ్రికి గుండెపోటు

కడుపులో కత్తిపోట్లు ఎక్కువగా పడటంతో శేఖర్ కుప్పకూలిపోయాడు. వెంటనే హోసూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి శేఖర్ ను తరలించారు. చికిత్స పొందుతున్న శేఖర్ చనిపోయాడు. కళ్లముందే తమ్ముడు కొడుకు విజయ్ తన సొంత కొడుకు శేఖర్ ను పొడిచి చంపేశాడని ఆవేదనతో ఉన్న అన్నయ్యప్పకు ఇంటిలోనే గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలేశారు.

 ఫ్యామిలీ రక్తచరిత్రతో టెన్షన్ టెన్షన్

ఫ్యామిలీ రక్తచరిత్రతో టెన్షన్ టెన్షన్

కొడుకు హత్యకు గురికావడం, తండ్రి ఆవేదన చనిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు విషాదంలో మునిగిపోయాడు. శేఖర్, అతని తండ్రి అన్నయ్యప్ప శవాలు ఉన్న ఇంటి పక్కనే హత్య చేసిన విజయ్ ఇల్లు ఉండటం, అందరూ బంధువులే కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయ్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నామని హోసూరులోని సిఫ్ కాట్ పోలీసులు చెప్పారు.

English summary
Younger brother kills brother for misbehaving with wife, father dies of heart attack after son's murder in Hosur in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X