మహిళ పేరుతో ఫేస్‌బుక్ ఖాతా: పోర్న్ లింక్స్
కోల్ కతా: ఓ మహిళ పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఎకౌంట్ తెరచి, అందులో నగ్న చిత్రాలు, అశ్లీల సాహిత్యాన్ని పోస్టు చేసి ఆమె జీవితంతో చెలగాటం ఆడుకున్న యువకుడిని పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ పోలీసులు అరెస్టు చేశారు.
సయంతన్ సర్కార్ (23) అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. సయంతన్ సర్కార్ కోల్ కతా నగరానికి చెందిన ఓ మధ్య వయస్కురాలు పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఎకౌంట్ ప్రారంభించాడు.

తరువాత ఆ ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలను పోస్టు చేశాడు. ప్రొఫైల్ లో ఫోటోలు పెట్టాడు. ఇదే ఫేస్ బుక్ లో నగ్న చిత్రాలు, అశ్లీల సాహిత్యం, పోర్న్ వెబ్ సైట్ లింక్ లో పోస్టు చేశాడు. తరువాత ఆమె జీవితంతో చెలగాటం ఆడుకున్నాడు.
స్నేహితుల ద్వారా ఆమెకు విషయం తెలిసింది. తన పరువు తీశారని, వెంటనే నిందితులను అరెస్టు చెయ్యాలని ఆ మహిళ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications