బెంగళూరు ఎయిర్ పోర్టులో యూట్యూబర్ ఏం చేశాడంటే ?, వైరల్ వీడియోతో చిక్కిపోయాడు !

బెంగళూరుకు చెందిన ప్రముఖ యూట్యూబర్‌ను అనధికారిక ప్రదేశంలో వీడియో తీసిన ఆరోపణపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని యలహంకకు చెందిన యూట్యూబర్ వికాస్ గౌడను అరెస్టు చేశామని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేలో కొన్ని గంటల పాటు యూట్యూబర్ వికాస్ గౌడ మకాం వేశాడని అధికారులు అంటున్నారు.

బెంగళూరులోని దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై నిందితుడు వికాస్ గౌడ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే వికాస్ గౌడ టికెట్ లేకుండా లోపలికి వచ్చాడని అధికారులు అంటున్నారు. ఎయిర్ పోర్టు అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది కళ్లు కప్పిన వికాస్ గౌడ దాదాపు 24 గంటలు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే దగ్గరే ఉన్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

YouTuber arrested for making illegal videos at Bengaluru Inter National Airport

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు, సిబ్బంది కళ్లు కప్పిన యూట్యూబర్ వికాస్ గౌడ విమానాశ్రయంలోకి ప్రవేశించి వీడియోలు తీశాడని అధికారులు తెలిపారు. వికాస్ గౌడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సీఐఎస్ఎఫ్ అధికారులు బెంగళూరు యూట్యూబర్ వికాస్ గౌడపై కేసు నమోదు చేశారు. కానీ వికాస్‌గౌడ్‌ విమానంలో వెళ్లేందుకు టిక్కెట్‌ తీసుకుని ఎయిర్ పోర్టులోకి వెళ్లాడని తెలిసింది.

అయితే టిక్కెట్టు తీసుకోని విమానంలో ప్రయాణం చేయకుండా వికాస్ గౌడ ఎయిర్ పోర్టులోని రన్‌వేపైనే ఉండిపోయాడని అధికారులు అంటున్నారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రన్ వే పరిసర ప్రాంతాల్లో ఉన్న వికాస్ గౌడ అక్కడ వీడియోలు తీశాడని అధికారులు తెలిపారు. బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు నిందితుడు వికాస్ గౌడను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వికాస్ గౌడ నేరం అంగీకరించాడని అధికారులు అంటున్నారు.

విమానంలో ప్రయాణించేందుకు నాకు టిక్కెట్ వచ్చిందని, కానీ తాను విమానంలో ప్రయాణం చేయకుండా రన్‌వేపైనే ఉండిపోయానని, దాదాపు 4-5 గంటల పాటు అక్కడే ఉండి వీడియో తీశానని విచారణలో వికాస్ గౌడ వివరించినట్లు సమాచారం. వికాస్ గౌడ యూట్యూబ్‌లో ఫుడ్ అండ్ ట్రావెలింగ్ తో సహా ప్రత్యేక కంటెంట్‌ను రూపొందించేవాడని అధికారులు తెలిపారు.

ఇప్పటికే వికాస్ గౌడకు యూట్యూబ్‌లో 113K ఫాలోవర్లు ఉన్నారు. అయితే వికాస్ గౌడకు వ్యూస్ పెంచుకోవడానికి అక్రమంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మీద వీడియోలు తీశాడని, అది నేరం అని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+