Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాఫీ విత్ తలైవా: రజినీకాంత్‌తో వైసీపీ ఎంపీ చెట్టాపట్టాల్- మోహన్ బాబుతోనూ

బెంగళూరు: ప్రముఖ నటి, మండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత కుమారుడు, కన్నడ నటుడు అభిషేక్ అంబరీష్ వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ దీనికి వేదిక అయింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అవైవ బిద్దప్పను ఆయన పెళ్లాడారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అభిషేక్.. శాండల్‌వుడ్ రెబెల్ స్టార్, దివంగత అంబరీష్-సుమలత కుమారుడు. 2019లో అమర్ సినిమా ద్వారా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. అతను నటించిన లేటెస్ట్ మూవీ- బ్యాడ్ మానర్స్. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రచిత రామ్, నిరంజన, పూర్ణచంద్ర మైసూరు కీలక పాత్రల్లో నటించారు.

MP Raghu Rama Krishnam Raju

ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహానికి శాండల్‌వుడ్ మొత్తం తరలివచ్చింది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దంపతులు, హీరో మంచు విష్ణు, దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

MP Raghu Rama Krishnam Raju

కేజీఎఫ్ స్టార్ యష్- రాధికా పండిట్ దంపతులు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, నటి రాధిక శరత్ కుమార్, సుహాసినీ మణిరత్నం, ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, సీనియర్ నటుడు దొడ్డన్న సహా పలువురు నటీ నటులు, దర్శక నిర్మాతలతో ప్యాలెస్ గ్రౌండ్స్ సందడిగా మారింది. ఎల్లుండి రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరు లేదా మండ్యలో రిసెప్షన్ జరిగే అవకాశం ఉంది.

తెలుగులో పలు సినిమాల్లో నటించారు సుమలత. ఆ పరిచయంతో మోహన్ బాబు తన కుటుంబంతో సహా ఆమె కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అలాగే- రజినీకాంత్, రాధిక, సుహాసినీ.. వంటి పలువురు సీనియర్ నటులు బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి అనుబంధ ఎంపీ కావడం వల్ల ఆ పార్టీకి చెందిన పలువురు శాసన సభ్యులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

MP Raghu Rama Krishnam Raju

ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన రఘురామ కృష్ణంరాజు- ప్రత్యేకంగా రజినీకాంత్‌తో భేటీ అయ్యారు. అతిథుల కోసం బస ఏర్పాటు చేసిన హోటల్‌లో వారు కలుసుకున్నారు. వారిద్దరి మధ్య చాలాసేపు చర్చలు సాగాయి. అనంతరం వేర్వేరు కార్లల్లో ప్యాలెస్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. రజినీకాంత్, మోహన్ బాబును కలిశారు రఘురామ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+