మహిళా సాధికారతకు స్పూర్తి; అంతర్జాతీయ మహిళాదినోత్సవం: ఈ ఏడాది లింగసమానత్వం థీమ్

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అసలీ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది. మార్చి 8వ తేదీన దీనిని నిర్వహించుకోవడానికి గల ప్రత్యేకత ఏంటి అంటే

కార్మిక ఉద్యమం నుండి పుట్టిన వేడుక.. మొదట యూఎస్ లో జాతీయ మహిళా దినోత్సవం

కార్మిక ఉద్యమం నుండి పుట్టిన వేడుక.. మొదట యూఎస్ లో జాతీయ మహిళా దినోత్సవం


అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

 ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. ప్రతి ఏటా మార్చ్ 8 న ఘనంగా వేడుకలు

ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. ప్రతి ఏటా మార్చ్ 8 న ఘనంగా వేడుకలు

అమెరికాలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన వచ్చింది. క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ 17 దేశాల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేయగా దానికి కాన్ఫరెన్స్ కు వచ్చిన అన్ని దేశాల మద్దతు లభించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది.

 వివక్షను బద్దలు కొట్టండి .. లింగ సమానత్వం సాధించండి

వివక్షను బద్దలు కొట్టండి .. లింగ సమానత్వం సాధించండి


ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీవ్రంగా తీసుకొని, ఆ ఏడాది ఆ అంశంపై మహిళలు దృష్టి సారించేలా నిర్వహిస్తారు. మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో స్వావలంబన సాధించేలా వారి హక్కుల గురించి అవగాహన కల్పించేలా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వివక్షను బద్దలు కొట్టండి , లింగ సమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్ తో నిర్వహించాలని నిర్ణయించారు. స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం సాధించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

 ఇంకా సమాజంలో స్త్రీ పురుష అసమానతలు .. అందుకే 2022 థీమ్ వివక్ష లేని సమాజం

ఇంకా సమాజంలో స్త్రీ పురుష అసమానతలు .. అందుకే 2022 థీమ్ వివక్ష లేని సమాజం


శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల దూసుకుపోతున్నా, అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా మహిళలు ముందుకు వెళుతున్నా కూడా ఎక్కడో ఒకచోట మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. లింగ సమానత్వం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఏడాది లింగ సమానత్వం పై అవగాహన కల్పిస్తూ లింగ సమానత్వం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వివక్షను బద్దలు కొట్టాలని, లింగ సమానత్వం ని సాధించడానికి 2022 వ సంవత్సరం కీలకమైందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చాలా దేశాల్లో సెలవు దినం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చాలా దేశాల్లో సెలవు దినం


ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా దేశాలు సెలవుదినంగా ప్రకటించాయి. రష్యా సహా చాలా దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినం ఓ సెలవు దినం. అమెరికాలో అయితే మార్చి నెల మహిళలు చరిత్ర సృష్టించిన నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడి ప్రకటన వెలువడుతుంది. సమాజంలో కొనసాగుతున్న అసమానతలను తగ్గించి, మహిళల యొక్క గొప్పతనాన్ని గుర్తించేలా నిర్వహించే ఈ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి.

 మహిళల్లో స్పూర్తిని నింపి స్వావలంబన సాధించే దిశగా నడిపించటమే ఉమెన్స్ డే లక్ష్యం

మహిళల్లో స్పూర్తిని నింపి స్వావలంబన సాధించే దిశగా నడిపించటమే ఉమెన్స్ డే లక్ష్యం

సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. అటువంటి మహిళలను గుర్తిస్తూ జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారికి స్ఫూర్తి నివ్వడమే కాకుండా, వారు సాధించాల్సిన విజయాలను, పరిష్కరించాల్సిన సమస్యలను వారికి గుర్తు చేస్తుందని చెప్పడం నిర్వివాదాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+