Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
మలేషియాలో ఇవాళ జరిగిన నౌకాదళ వార్షిక పరేడ్ విషాదాంతంగా ముగిసింది. నౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్లు ఒకేసారి గాల్గో ఎగురుతున్నాయి. అందులో రెండు హెలికాఫ్టర్లు దిశ మార్చుకుని పక్క పక్కనే వచ్చి ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో ఒకదాని రెక్కలు మరో దానికి తగిలి రెండూ వెంటనే కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 10 మందికి పైగా నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
ఇవాళ ఉదయం మలేషియాలోని లుముట్ నగరంలో రాయల్ నేవీ వార్షిక పరేడ్ జరుగుతోంది. ఇందులో భాగంగా హెలికాప్టర్లు కూడా విన్యాసాలు చేస్తున్నాయి. వీటిని అక్కడే ఉన్న అధికారులు, సిబ్బంది ఉత్కంఠగా తిలకిస్తున్నారు. అంతలో అందరూ చూస్తుండగానే రెండు హెలికాఫ్టర్లు పరస్పరం గుద్దుకున్నాయి. వెంటనే అదుపు తప్పి కిందకు కూలిపోయాయి. దీంతో వీటిలో ప్రయాణిస్తున్న 10 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి చావుతో పోరాడుతున్నారు.

Two helicopters belonging to the Royal Malaysian Navy collided during the annual naval parade rehearsal in the town of Lumut earlier today.
— Akbar Badshah (@i_AkbarBadshah) April 23, 2024
More than 10 Ppl died in this crashed and many Ppl are Injured Sources. pic.twitter.com/Xi2oM9I5T1
హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనా స్ధలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. హెలికాఫ్టర్లు ముక్కలు ముక్కలై కాలిపోయాయి. ఈ దారుణ దృశ్యాలకు సంబందించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే హెలికాప్టర్లు గాల్లో గుద్దుకున్న వీడియోలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలేషియా అధికారులు ఈ ఘటనపై అత్యున్నత స్ధాయి విచారణ చేపట్టారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications