వరదలో కొట్టుకుపోయిన 12కోట్ల విలువైన బంగారం.. ఎగబడిన జనం!

సునామి వచ్చే కొట్టుకుపోతున్నా, ప్రజా జీవితం అల్లకల్లోలం అవుతున్నా మనుషులకు మాత్రం బంగారం మీద పిచ్చి పోదు. మానవ జీవితానికి బంగారానికి అంత అవినాభావ సంబంధం ఉంది. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినా, ఆ ప్రాంతమంతా వర్షపు నీటితో మునిగి ఉన్నా బంగారం మీద యావ అక్కడ వాళ్లను దానికోసం ఆ బురదలో వరదలో ఎగబడేలా, వెంపర్లాడేలా చేసింది.

బంగారం కోసం చైనా వాసుల వెంపర్లాట
చైనాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించిన వేళ అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని అందరూ అనుకుంటున్న సమయంలో బంగారం కోసం చైనా వాసులు ఎగబడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన అందరూ ఆసక్తికరంగా చర్చించుకునేలా చేస్తున్నాయి.

12 crores worth gold washed away in china floods locals Gold hunting despite the flood

వరదలో కొట్టుకుపోయిన బంగారం, సేఫ్ బాక్స్
షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుచి కౌంటీలో ఇటీవల వరదల కారణంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. జూలై 25న ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో, లావోఫెంగ్జియాంగ్ అనే నగల దుకాణాన్ని సిబ్బంది ఉదయం తెరిచారు. అప్పటికే భారీవర్షాల వల్ల ఆ ప్రాంతమంతా నీట మునిగి ఉంది. అయితే ఎప్పుడైతే సిబ్బంది షాప్ తెరిచారో ఒక్కసారిగా వరదనీరు దుకాణంలోకి రావడంతో నగలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి.

12 కోట్ల రూపాయల విలువైన బంగారం గల్లంతు
ఇక కొట్టుకుపోయిన వాటిలో బోలెడన్ని బంగారు హారాలు, వజ్రాభరణాలు, బంగారపు గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, వెండి ఆభరణాలు ఉన్నాయి ఇవి మాత్రమే కాదు సేఫ్ బాక్స్ లో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు కొంత నగదు కూడా ఉంది. ఇక బంగారం షాపులో గల్లంతైన నగదు ఆభరణాల విలువ పది మిలియన్ యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

వరద నీళ్ళలో బంగారం వేట
ఇక ఎప్పుడైతే ఈ షాప్ లో బంగారం వరదలో కొట్టుకుపోయింది అని తెలిసిందో బంగారం కోసం స్థానికుల సాహసం మొదలైంది. వరద నీళ్లలో వీధుల్లోకి వచ్చి వెతకడం ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు కొంతమంది తమకు దొరికిన ఆభరణాలను తిరిగి దుకాణం యజమానికి ఇచ్చివేయగా ఇంకా కూడా బంగారం కోసం వెతుకులాట కొనసాగుతుంది. ఇప్పటివరకు కిలో బంగారం మాత్రమే తమకు తిరిగి దొరికిందని, మిగిలిన బంగారం కోసం అన్వేషిస్తున్నామని దుకాణం యజమాని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+